న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి.. జట్టుకు అద్భుత విజయాన్నందించి..

Asia Cup 2018: Injured Tamim Iqbals One-Handed Batting Sends Twitter Into A Frenzy

దుబాయ్‌: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ లంకపై గెలిచి ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలా తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకపై 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తమీమ్‌ ప్రదర్శన చూసినవాళ్లంతా అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఒంటి చేత్తో బ్యాటింగ్‌ చేయడం అద్భుతం:

‘ఒంటి చేత్తో బ్యాటింగ్‌ చేయడం నిజంగా అద్భుతం', ‘వావ్‌.. అతని ధైర్యానికి మెచ్చుకోవాలి', ‘గతంలో గ్రేమ్‌ స్మిత్‌ ఇలా చేశాడు.. ఇప్పుడు తమీమ్‌', ‘నీ దేశం కోసం ఒంటి చేత్తో ఆడావు.. నిజంగా నీవు హీరోవే' అంటూ పలువురు క్రికెట్‌ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తొలి వన్డేలోనే తీవ్ర గాయం కారణంగా తమీమ్‌.. కనీసం ఆరువారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ముష్ఫికర్‌ రహీమ్‌ 150 బంతుల్లో (144)

ముష్ఫికర్‌ రహీమ్‌ 150 బంతుల్లో (144)

గాయం కారణంగా రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగి.. తిరిగి చివర్లో క్రీజులోకి వచ్చి ఒంటి చేత్తో బ్యాటింగ్‌ చేసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. అతని ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అద్భుత ఇన్నింగ్స్‌తో బంగ్లాకు అనూహ్యమైన స్కోరును అందించిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (144) 150 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సులతో అద్భుతంగా ఆడాడు.

 ముష్ఫికర్‌, మిథున్‌ చెలరేగి

ముష్ఫికర్‌, మిథున్‌ చెలరేగి

బంగ్లా ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఇద్దరు బ్యాట్స్‌మెన్లు లిటన్‌ దాస్‌, షకీబ్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. తర్వాత రెండో ఓవర్‌లో లక్మల్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఎడమ చేతి మణికట్టుకు బంతి బలంగా తాకడంతో గాయం కారణంగా రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. లంక బౌలర్ల ధాటికి ఆ తర్వాత పరుగులు రావడం కష్టంగా మారింది. పది ఓవర్లకు ఆ జట్టు స్కోరు 24 పరుగులే. అనంతరం ముష్ఫికర్‌, మిథున్‌ చెలరేగి ఆడారు.

 గాయంతోనే బరిలోకి తమీమ్‌ ఇక్బాల్‌

గాయంతోనే బరిలోకి తమీమ్‌ ఇక్బాల్‌

123 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన రహీమ్‌కు.. మరో ఎండ్‌ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. బంగ్లా 9వ వికెట్‌ చేజార్చుకున్న అనంతరం తిరిగి గాయంతోనే తమీమ్‌ ఇక్బాల్‌ 47వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. గాయంతో బాధపడుతున్నప్పటికీ.. ఒంటి చేత్తోనే బ్యాటింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో క్రికెట్‌ అభిమానులు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

1
44046
Story first published: Sunday, September 16, 2018, 12:54 [IST]
Other articles published on Sep 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X