ఆసియా కప్: ఇండియా Vs హాంకాంగ్ మ్యాచ్‌ని ఎక్కడ చూడాలి


హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు తన తొలి మ్యాచ్‌కి సన్నద్ధమైంది. టోర్నీలో భాగంగా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా పసికూన హాంకాంగ్ జట్టుతో మంగళవారం తలపడనుంది.
గ్రూప్-ఏలో భాగంగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌కి దుబాయిలోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి టోర్నీని విజయంతో ఆరంభించాలని టీమిండియా ఊవిళ్లూరుతోంది. మరోవైపు పాక్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన హాంకాంగ్ కనీసం రెండో మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది.
ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారిగా రోహిత్ శర్మ సారథ్యం వహించడంతో జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ అనుభవం అంతగా లేని
అంతర్జాతీయ క్రికెట్ అనుభవం అంతగా లేని హాంకాంగ్ జట్టుపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని రోహితే సేన తహతహలాడుతోంది. మరోవైపు అన్షే ఖాన్ నాయకత్వంలోని హాంకాంగ్ జట్టు పాకిస్థాన్‌తో జరిగిన తొలి గ్రూప్-ఏ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు కేవలం 116 పరుగులకే ఆలౌటైంది. హాంకాంగ్ జట్టులో ఐజాజ్ ఖాన్ (27), కించిత్ షా (26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

120 పరుగులతో అలవోక విజయం
ఆనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులతో అలవోక విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లోనూ హాంకాంగ్ జట్టు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. స్వల్ప లక్ష్యం కావడంతో పాక్ ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. ఓపెనర్లు ఇమామ్, ఫఖర్ జమాన్ (24) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇమామ్ జట్టును నడిపించారు.

రెండో వికెట్‌కు 52 పరుగులు
ఈ క్రమంలో ఆజమ్ తన కెరీర్‌లో 2వేల పరుగుల మైలురాయి అందు కున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 52 పరుగులు జత చేశారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలతో రెండు సార్లు ఔట్ కాకుండా తప్పించుకున్న ఇమామ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, షోయబ్ మాలిక్ (9 నాటౌట్) బౌండరీతో మ్యాచ్‌ను ముగించి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఒకే ఒక్క వన్డే మ్యాచ్
ఇదిలా ఉంటే భారత్-హాంకాంగ్ జట్ల మధ్య ఇప్పటిదాకా ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు కూడా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. పటిష్టమైన టీమిండియాకు పసికూన హాంకాంగ్ కనీస పోటీ కూడా ఇవ్వలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ధోనీ( వికెట్ కీపర్ ), దినేష్ కార్తీక్, హర్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బమ్రా , శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.
హాంకాంగ్ జట్టు:
అనాషామన్ రత్ (కెప్టెన్), ఐజాజ్ ఖాన్, బాబర్ హయత్, కామెరాన్ మక్ఆల్సలాన్, క్రిస్టోఫర్ కార్టర్, ఎహ్సాన్ ఖాన్, ఎహసన్ నవాజ్, అర్షద్ మొహమ్మద్, కిన్చిత్ షా, నదీమ్ అహ్మద్, రాగ్ కపూర్, స్కాట్ మక్కెచ్చీ, తన్వీర్ అహ్మద్, తన్వీర్ అఫ్జల్, వకాస్ ఖాన్, అఫ్తాబ్ హుస్సేన్

మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయి
మ్యాచ్ ఎన్ని గంటలకు?
సాయంత్రం 5 గంటలకు
హాట్ స్టార్‌లో లైవ్ ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications