Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్: టీమిండియా బ్యాటింగ్, ఖలీల్‌ అహ్మద్‌ అరంగేట్రం

Asia Cup 2018: India Vs Hong Kong: Hong Kong win toss, invite Rohit Sharma to bat

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్-హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు కెప్టెన్ అన్షుమన్‌ రాత్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి కల్పించిన నేపథ్యంలో టోర్నీలో టీమిండియాకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తుది జట్టులో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. రోహిత్‌శర్మ, ధావన్ ఓపెనింగ్ చేయనున్నారు. రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్, ధోనీ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

బౌలింగ్‌లో భువనేశ్వర్, కుల్‌దీప్ యాదవ్, చాహల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన హాంకాంగ్ జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోగా.. భారత్‌కి ఇదే మొదటి మ్యాచ్.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని విజయంతో ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. పదేళ్ల క్రితం ఇదే ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. అప్పటి మ్యాచ్‌లో భారత్‌ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో మరోసారి ఇరు జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి.

1
44049

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం తలపడనున్న భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి లయ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్‌తో బుధవారం జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్ టీమిండియాకు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడనుంది.

జట్ల వివరాలు:
భారత్‌: రోహిత్‌, శిఖర్‌ ధావన్, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, ధోనీ, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, యజువేంద్ర చాహల్‌‌

హాంకాంగ్‌: నిజ్కత్‌ ఖాన్‌, అన్షుమాన్‌ రాఠ్‌, బాబర్‌ హయత్‌, కించిత్‌ షా, క్రిస్టొఫర్‌ కార్టర్‌, ఎహ్‌సాన్‌, ఇజాజ్‌, స్కాట్‌ మెకెనీ, అఫ్జల్‌, నవాజ్‌, నదీమ్‌ అహ్మద్‌.

Story first published: Tuesday, September 18, 2018, 17:29 [IST]
Other articles published on Sep 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+