ఆసియా కప్ 2018: ఏ జట్టూ నమోదు చేసిన రికార్డులు భారత్ సొంతం

హైదరాబాద్: 14వ ఆసియా కప్ టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు అత్యుత్తమ రికార్డుని కలిగి ఉంది. అత్యధికంగా ఈ ట్రోఫీని భారత జట్టు ఆరుసార్లు కైవసం చేసుకుంది. దీంతో ఆసియా కప్‌లో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘతన భారత్ సొంతం చేసుకుంది.
2016లో మొట్టమొదటిసారి ఆసియా కప్‌ను నిర్వాహకులు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈ ఫార్మాట్‌లోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. మొట్టమొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక అయింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
రౌండ్ రాబిన్ పద్ధతిన జరిగిన ఈ టోర్నీని కొత్తగా ఏర్పడిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించింది. మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని టీమిండియా పాకిస్థాన్, శ్రీలంకను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 13 సార్లు ఈ టోర్నీ నిర్వహించారు. 12 సార్లు ఈ టోర్నీలో పోటీకి దిగిన భారత్ తొమ్మిది సార్లు ఫైనల్ చేరింది.

ఆరు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత్
ఆరు సార్లు ఆసియా కప్ కైవసం చేసుకుంది. మూడు సార్లు రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకుంది. భారత్ ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలవగా, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఈ ట్రోఫీని నెగ్గాయి. తొమ్మిది సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా కూడా భారత జట్టు నిలిచింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి.

రెండు గ్రూపులుగా విడిపోయి
ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి టోర్నీలో తలపడనున్నాయి. హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 15(శనివారం) టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

సెప్టెంబర్ 28న పైనల్ మ్యాచ్
టోర్నీలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. గత ఆసియా కప్ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఆసియా కప్‌లో మిగతా జట్లకు సాధ్యం కాని రికార్డులను, అరుదైన ఘనతలు సొంతం చేసుకున్న భారత జట్టు 2018లో యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీలోనూ అదే స్థాయిలో రాణించి టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.

ఆసియా కప్ టోర్నీల్లో భారత జట్టు ప్రదర్శన:
1984 - ఛాంపియన్
1986 - టోర్నీ నుంచి తప్పుకుంది
1988 - ఛాంపియన్
1990/91- ఛాంపియన్
1995- ఛాంపియన్
1997 - రన్నరప్
2000 - ఫైనల్‌కు చేరలేదు
2004 - రన్నరప్
2008 - రన్నరప్
2010 - ఛాంపియన్
2012 -ఫైనల్ చేరలేదు
2014 -ఫైనల్ చేరలేదు
2016 - ఛాంపియన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications