For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కి గాయాల బెడద..: జట్టు మేనేజ్‌మెంట్ ఏం చేస్తోంది?, విమర్శలు

Asia Cup 2018: Indias list of walking wounded grows; calls for better injury management

హైదరాబాద్: గాయం కారణంగా ఆసియాకప్ నుంచి ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమైన కొద్ది గంటలకే మరో ఇద్దరు అటగాళ్లు అర్ధాంతరంగా వైదొలిగారు. వివరాల్లోకి వెళితే... ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, పేసర్ శార్ధూల్ ఠాకూర్, స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు గురువారం బీసీసీఐ ప్రకటించింది.

ఈ ముగ్గురి స్థానాల్లో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ సిద్ధార్థ కౌల్‌ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ ముగ్గరూ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగడానికి ముందే యూఏఈకి చేరుకుంటాని బీసీసీఐ ప్రతినిథి ఒకరు వెల్లడించారు. జట్టులోని ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు గాయాలు పాలవడపై జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించక పోవడం వల్లే ఇలా జరిగిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరిస్ ఆరంభానికి ముందు నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, భువనేశ్వర్, అశ్విన్, పాండ్యా, సిద్ధార్ధ్ కౌల్, అక్షర్ పటేల్ ఉన్నారు.

గాయం కారణంగా కౌంటీలకు దూరం

గాయం కారణంగా కౌంటీలకు దూరం

ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది జూన్‌లో కౌంటీ క్రికెట్ జట్టు అయిన సర్రేతో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో అప్పట్లో ఆప్ఘనిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టుకు కూడా కోహ్లీ దూరమైందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో కోహ్లీ గాయ పడటంతో అటు కౌంటీ క్రికెట్‌తో పాటు ఇటు ఆప్ఘన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న పునరావాస కేంద్రానికి వెళ్లి ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో ఇంగ్లాండ్‌‌ పర్యటన సిద్దమయ్యాడు. అయితే, కోహ్లీ గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడం విశేషం.

 లార్డ్స్ టెస్టులో తిరగబెట్టిన కోహ్లీ గాయం

లార్డ్స్ టెస్టులో తిరగబెట్టిన కోహ్లీ గాయం

ఇందుకు నిదర్సం లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీ గాయం తిరగబెట్టడమే. లార్ట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీంతో నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీ అందుబాటులో ఉండాటా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, రెండో టెస్టుకు మూడో టెస్టుకు మధ్య ఐదు రోజుల సమయం ఉండటంతో కోహ్లీ త్వరగానే కోలుకుని టెస్టు సిరిస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. దీని ఫలితం ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇదే పరిస్థితిని

రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇదే పరిస్థితిని

ఇంగ్లీషు గడ్డపై టీమిండియా గెలిచిన ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అప్పట్లో అశ్విన్ ఫిట్‌గా లేకపోయినా సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆడించినట్లు వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో గానీ సౌతాంప్టన్ టెస్టులో ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ తన అద్భుత ప్రదర్శనతో 9 వికెట్లు తీస్తే, అశ్విన్ మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగో టెస్టు తప్పక గెలవాల్సిన టెస్టు కావడంతో అశ్విన్ గాయాన్ని పట్టించుకోని జట్టు మేనేజ్ మెంట్ అతడిని ఆడించినట్లు తెలుస్తోంది.

 గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌కు దూరం

గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌కు దూరం

ఇక, టీమిండియా ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాయాలు పాలవుతున్నాడు. గాయంతో భువనేశ్వర్ ఇబ్బందిపడుతున్నప్పటికీ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో మూడో వన్డేలో జట్టు మేనేజ్‌మెంట్ భువీని ఆడించినట్లు తెలుస్తోంది. దీంతో భువీ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే యో-యో టెస్టు క్లియర్ చేయడంతో ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్నాడు.

ఆసియా కప్‌లో ముగ్గురు క్రికెటర్లకు గాయాలు

ఇప్పుడు, యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ నుంచి గాయాల కారణంగా ముగ్గురు భారత క్రికెటర్లు అర్ధాంతరంగా వైదొలిగారు. మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వెన్నుకి గాయమైంది. దీంతో బంతి విసిరిన తర్వాత పిచ్ మధ్యలోనే ఈ ఆల్‌ రౌండర్ కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు ఫిజియో సపర్యలు చేసినా.. అతను కనీసం నిల్చోలేకపోవడంతో.. స్ట్రెచర్ మీద మైదానం నుంచి వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

 జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం

జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం

ఆ తర్వాత కొద్దిసేపటికే సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్‌ చేతి వేలికి గాయమైంది. వీరితో పాటు హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ కూడా గాయపడటంతో.. ముగ్గురూ టోర్నీకి దూరమయ్యారు. జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆటగాళ్లు గాయాలు బారిన పడుతున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Story first published: Thursday, September 20, 2018, 18:04 [IST]
Other articles published on Sep 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+