న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాను ఓడించాలంటే అదే చేయాలి: పాక్ కెప్టెన్

Asia Cup 2018: India Are Better Side Even Without Virat Kohli, Says Pakistan Captain Sarfraz Ahmed

హైదరాబాద్: ఆసియాకప్‌లో భారత్‌ను ఓడించాలంటే తమ జట్టు కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందని పాకిస్థాన్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నాడు. టోర్నీలో హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. తమ ఆటలో కొన్ని లోపాలు గమనించానని పేర్కొన్నాడు.

కావాల్సినంత రాబట్టుకోలేకపోవడం

కావాల్సినంత రాబట్టుకోలేకపోవడం

‘ఒక కెప్టెన్‌గా హాంకాంగ్‌ మ్యాచ్‌లో మేమింకా మెరుగవ్వాల్సిన అంశాలను పరిశీలించా. టోర్నీలో అందరికన్నా ముందంజలో నిలవాలంటే మేం తొమ్మిది లేదా పది వికెట్ల తేడాతో గెలవాల్సి ఉంది. కొత్త బంతితో ఇంకా బాగా బౌలింగ్‌ చేయాల్సి ఉంది. కావాల్సినంత స్వింగ్‌ను మేం రాబట్టుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత సాధన శిబిరంలో మేం దీనిపై పనిచేస్తాం.'

కోహ్లీ లేకపోవడంపై పెద్దగా వ్యత్యాసం

కోహ్లీ లేకపోవడంపై పెద్దగా వ్యత్యాసం

'హాంకాంగ్‌పై మంచి విజయమే సాధించాం. కానీ భారత్‌పై గెలవాలంటే మాత్రం మేం మూడు విభాగాల్లోనూ అత్యుత్తమంగా ఉండాలి. టీమిండియాలో మంచి ప్లేయర్లు ఉన్నారు. కోహ్లీ లేకపోవడం జట్టుపై పెద్దగా వ్యత్యాసం చూపించదు. వారి బ్యాటింగ్ విభాగం చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ చూసేవారిని అద్భుతంగా అలరిస్తుందని ఆశిస్తున్నా.'

కొత్త వ్యూహంతో బరిలోకి దిగనున్నాం:

కొత్త వ్యూహంతో బరిలోకి దిగనున్నాం:

'గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మేం ఆ సంగతి అస్సలు గుర్తుంచుకోలేదు. అది లండన్. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి గెలిచాం. ఇదంతా జరిగి దాదాపు ఓ సంవత్సరం గడిచిపోతుంది. ప్రస్తుతం భారత్‌తో తలపడనున్న బుధవారం మేం కొత్త వ్యూహంతో బరిలోకి దిగనున్నాం.' అని తెలిపాడు.

కోహ్లీ లేకపోయినా టీమిండియా సిద్ధంగా

కోహ్లీ లేకపోయినా టీమిండియా సిద్ధంగా

'మరో వైపు టీమిండియా ఎంత బలంగా ఉందో పాకిస్తాన్ జట్టు అంతే స్థాయిలో కనిపిస్తోంది'. అని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ తెలిపాడు. జట్టులో విరాట్ కోహ్లీ లేమి అసలు ఎక్కడా కనిపించట్లేదని కోహ్లీ లేకపోయినా రాణించేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని తెలిపాడు. భారత్‌, పాక్‌ సెప్టెంబరు 19న బుధవారం హోరాహోరీ తలపడనున్నాయి.

Story first published: Tuesday, September 18, 2018, 12:11 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X