For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: 'ఈ పునరాగమనాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా'

Asia Cup 2018 : Jadeja Says I will Always Remember This Comeback
Asia Cup 2018: I will always remember this comeback: Ravindra Jadeja

హైదరాబాద్: తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవడాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. దాదాపు 480 రోజుల తర్వాత టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకుని అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగిపోవడమే కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం సొంతం చేసుకున్నాడు.

ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా శుక‍్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. వన్డే కెరీర్‌లో రవీంద్ర జడేజాకిది పదో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు కావడం విశేషం. నాలుగేళ్ల తర్వాత మరోసారి అతనికి ఈ పురస్కారం లభించింది.

చివరిసారి రవీంద్ర జడేజా 2014లో ఢాకాలో జరిగిన ఆసియా కప్‌లో అప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ "ఎంతో సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాతవన్డే మ్యాచ్‌ ఆడాను. ఎక్కడైనా నాదైన ముద్రచూపించాలని భావించా" అని అన్నాడు.

1
44052
 అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా

అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా

"ఎప్పుడు అవకాశం లభించినా నా సామర్థ్యానికి తగినట్లుగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా అనిపిస్తోంది. కుల్దీప్, చాహల్‌ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడం వల్ల నేను వికెట్లు తీయడం సులువైంది. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నేను ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉంది" అని జడేజా అన్నాడు.

ఎవరికీ ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు

ఎవరికీ ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు

"కానీ నేను ఏమి చేయగలను అనే విషయంలో ఎవరికీ ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీ మ్యాచ్‌లో నా బాధ్యత నెరవేర్చాలి. పాకిస్తాన్‌తో పాటు తర్వాతి మ్యాచ్‌లలో కూడా రాణించాలని పట్టుదలగా ఉన్నా" అని జడేజా చెప్పుకొచ్చాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో స్థానంపై అడిగిన ప్రశ్నపై జడేజా స్పందిస్తూ.. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదని అన్నాడు.

గతేడాది జులైలో భారత్ తరుపున చివరిసారిగా

గతేడాది జులైలో భారత్ తరుపున చివరిసారిగా

గత ఏడాది జూలైలో రవీంద్ర జడేజా భారత్‌ తరఫున చివరిసారిగా వన్డే బరిలోకి దిగాడు. కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. ఆ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 0/27తో నిరాశపరిచాడు. ఆ తర్వాత జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ 3.3 ఓవర్లు వేసి ఏకంగా 41 పరుగులు సమర్పించుకోవడంతో అతడిని సెలక్టర్లు పక్కన పెడుతూ వచ్చారు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమైన జడేజా

పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమైన జడేజా

దీనికి తోడు భారత చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ రాణిస్తుండటంతో ఏడాదిగా జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమయ్యాడు. తాజాగా ఆసియా కప్‌ జట్టులో కూడా అతని పేరు లేదు. జడేజా ఆఖరి మ్యాచ్‌ తర్వాతి నుంచి బుధవారం పాక్‌తో మ్యాచ్‌ వరకు భారత్‌ 27 వన్డేలు ఆడింది. కెప్టెన్‌ కోహ్లీ అండగా చాహల్, కుల్దీప్‌ జట్టులో రాణించడంతో జడేజా అవసరం లేకుండా పోయింది.

మూడో స్పిన్నర్‌గా జట్టులోకి

మూడో స్పిన్నర్‌గా జట్టులోకి

పాకిస్థాన్‌తో వన్డేలో హార్దిక్‌ పాండ్యా గాయపడటంతో శుక్రవారం బంగ్లాతో వన్డేలో జడేజా అనుకోకుండా అవకాశం దక్కించుకున్నాడు. అతను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చాడు. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని జడేజా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన జడేజా 29 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి

నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి

2014 ఆగస్టు తర్వాత జడేజా ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. మ్యాచ్‌ గెలిపించే ప్రదర్శనతో తనను తర్వాతి మ్యాచ్‌కూ ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. ఆదివారం పాక్‌తో పోరులో ఇద్దరు స్పిన్నర్లనే ఆడించాలనుకుంటే.. ఇంతకుముందు జడేజా స్థానానికి ఎసరు పెట్టిన ఇద్దరు స్పిన్నర్లలో ఒకరిపై వేటు వేయాల్సిందే మరి.

Story first published: Saturday, September 22, 2018, 15:57 [IST]
Other articles published on Sep 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+