
భారత్-పాక్ మ్యాచ్‌పై
ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య అలాంటి ఆసక్తికర పోరుకు దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ వేదికైంది. టోర్నీలో భాగంగా బుధవారం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే, ఆసియా కప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయి.

ఇప్పటివరకు 12 సార్లు తలపడిన భారత్-పాక్
ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 6 సార్లు నెగ్గగా, పాక్ 5 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం తేలలేదు. ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన దేశంగా భారత్‌కు పేరుంది. ఆసియా కప్‌ను భారత్ ఆరు సార్లు నెగ్గగా, పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే సాధించింది.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ
ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 12 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 45.90 యావరేజితో 459 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆసియాకప్‌నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ గణాంకాలు
* 4 - 1984లో జరిగిన ఆసియాకప్‌లో రనౌట్ అయిన పాక్ ఆటగాళ్ల సంఖ్య.
* కొలంబో - భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆ ఆసియా కప్ కోలంబో వేదికగా జరిగింది.
* 330 - ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య నమోదైన అత్యధిక స్కోరు.
* విరాట్ కోహ్లీ - ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు.
* షోయబ్ మాలిక్ - ఆసియాకప్‌లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు.


Click it and Unblock the Notifications












