For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ నుంచి కోహ్లీ పారిపోయాడు: పాక్ ఆటగాడికి గట్టి కౌంటర్ ఇచ్చిన గంభీర్

Asia Cup 2018 : Gautam Gambhir Gives Strong Reply To The Former Pak Cricketer
Asia Cup 2018: Gautam Gambhir strikes back at Tanvir Ahmed for calling Virat Kohli a ‘deserter’

హైదరాబాద్: వర్క్ లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు ఆసియా కప్ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ వెన్నునొప్పితో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు.

ఆ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలోని పునరావాస కేంద్రానికి వెళ్లడం... అక్కడ వెన్నునొప్పి నుంచి కోలుకోవడంతో ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ బయల్దేరాడు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీ గాయం తిరగబెట్టింది.

ఆసియా కప్ టోర్నీ నుంచి కోహ్లీకి విశ్రాంతి

ఆసియా కప్ టోర్నీ నుంచి కోహ్లీకి విశ్రాంతి

రెండో టెస్టుకు, మూడో టెస్టుకు మధ్య ఐదు రోజుల సమయం ఉండటంతో గాయం నుంచి కోలుకున్న కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటన అసాంతం ఆడాడు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్ నుంచి సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

 కోహ్లీ పారిపోయాడన్న పాక్ మాజీ ఆటగాడు తన్వీర్‌

కోహ్లీ పారిపోయాడన్న పాక్ మాజీ ఆటగాడు తన్వీర్‌

ఆసియాకప్‌ నుంచి విరాట్ కోహ్లీ పారిపోయాడని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఏరే న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ విశ్రాంతి ఇవ్వడంపై తన్వీర్‌ మాట్లాడుతూ "నా అంచనా ప్రకారం పాకిస్థాన్‌ జట్టుకు భయపడే కోహ్లీ ఆసియాకప్‌ నుంచి పారిపోయాడు. ఇంగ్లాండ్‌తో అతడు అన్ని సిరీస్‌లూ ఆడాడు" అని అన్నాడు.

 పాక్‌తో మూడు మ్యాచ్‌లు

పాక్‌తో మూడు మ్యాచ్‌లు

"అప్పుడు కొద్ది రోజులు మాత్రమే వెన్నునొప్పితో బాధపడ్డాడు. మిగతా రోజులన్నీ బాగానే ఆడాడు. దేశంకోసం ఇంగ్లాండ్‌తో ఆడిన వ్యక్తి ఆసియాకప్‌ ఆడలేడా? ఇండియా పాకిస్థాన్‌తో ఫైనల్స్‌తో సహా మూడు సార్లు తలపడాల్సివస్తుందని కోహ్లీ ముందే ఊహించి ఉంటాడు. అందుకే టోర్నీ నుంచి పారిపోయాడు" అని పేర్కొన్నాడు.

ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్

ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్

అయితే, తన్వీర్ వ్యాఖ్యలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. "కోహ్లీ పేరు మీద ఇప్పటికే 35-36 సెంచరీల రికార్డు ఉంది. అతనికి మరో సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తన్వీర్‌ పేరుమీద కనీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు లేవు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది" అని అన్నాడు.

Story first published: Friday, September 21, 2018, 12:45 [IST]
Other articles published on Sep 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+