For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ 2018: టోర్నీలో పాల్గొనే ఆరు జట్ల పూర్తి జాబితా ఇదే

ASIA CUP 2018 : Details Of 1st ODI Captains And Players
Asia Cup 2018: Full squad list of all six participating teams

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్ని టోర్నీలున్నా ఒకే ఖండానికి చెందిన దేశాల మధ్య నిర్వహించే ఏకైక టోర్నీ ఇదే కావడం విశేషం. యూఏఈ వేదికగా ఆసియా కప్ 2018 జరగనుంది. ఇందులో భాగంగా దుబాయి, అబుధాబి నగరాలు ఈ టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి.

టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ఆసియా కప్ టైటిల్ రేసులో ఉన్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు ఉండగా, గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి.

ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్ రౌండ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి. టోర్నీలో భాగంగా హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించింది.

గత ఆసియా కప్ టోర్నీని తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.

టోర్నీలో భాగంగా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో క్వాలిఫయిర్‌తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది. ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే ఆరు జట్లు ఇవే....

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ధోనీ( వికెట్ కీపర్ ), దినేష్ కార్తీక్, హర్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బమ్రా , శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.

పాకిస్తాన్ జట్టు:
ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆసిఫ్ అలీ, హరిస్ సోహైల్, షాదాబ్ ఖాన్, ముహమ్మద్ నవాజ్, ఫహిమ్ అష్రఫ్, హసన్ ఆలీ, మహమ్మద్ అమిర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ షెన్వారీ, షాహీన్ అఫ్రిది

బంగ్లాదేశ్ జట్టు:
షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మష్ఫ్రే మోర్టజా (కెప్టెన్), మహమ్మద్ మిథున్, లిటోన్ దాస్, ముష్ఫికర్ రహీం(వికెట్ కీపర్), అరిఫుల్ హాక్, మహ్మదుల్లా, మోసద్కేక్ హుస్సేన్, మెహిదీ హసన్, నజ్ముల్ ఇస్లాం, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, అబూ హేడర్ రోనీ, నజ్ముల్ హుస్సేన్ షంటో, మొమినుల్ హాక్

శ్రీలంక జట్టు:
ఏంజెలో మాథ్యూస్ (కెప్టెన్), కుషాల్ పెరేరా(వికెట్ కీపర్), కుషాల్ మెండిస్, ఉపల్ తరంగ, నిరోషాన్ డిక్వెల్లా, షెహాన్ జయసూర్య, తిసెరా పెరెరా, దాసున్ షణక, ధనుంజయ డి సిల్వా, అకిలా జాయా, దిల్రువాన్ పెరేరా, అమిలా అపోన్సో, కసూన్ రాజితా, సురంగ లక్మల్, దుష్మంత చమేరా, లసిత్ మలింగ

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
అస్ఘర్ ఆఫ్ఘన్ (కెప్టెన్), మొహమ్మద్ షెజాద్ (వికెట్ కీపర్), ఇహ్సునుల్లా జనత్, జావేద్ అహ్మాది, రహ్మాత్ షా, హష్మాత్ షహీడి, మొహమ్మద్ నబి, గుల్బాడిన్ నయిబ్, రషీద్ ఖాన్, నజీబుల్లా జద్రన్, ముజీబ్-ఉర్-రెహమాన్, అఫ్తాబ్ ఆలం, సాముల్లా షిన్వారీ, మునీర్ అహ్మద్ కకర్ (వికెట్ కీపర్), సయ్యద్ అహ్మద్ షెర్జాద్, షరాఫుద్దిన్ అష్రఫ్, వఫాదర్

హాంకాంగ్ జట్టు:
అనాషామన్ రత్ (కెప్టెన్), ఐజాజ్ ఖాన్, బాబర్ హయత్, కామెరాన్ మక్ఆల్సలాన్, క్రిస్టోఫర్ కార్టర్, ఎహ్సాన్ ఖాన్, ఎహసన్ నవాజ్, అర్షద్ మొహమ్మద్, కిన్చిత్ షా, నదీమ్ అహ్మద్, రాగ్ కపూర్, స్కాట్ మక్కెచ్చీ, తన్వీర్ అహ్మద్, తన్వీర్ అఫ్జల్, వకాస్ ఖాన్, అఫ్తాబ్ హుస్సేన్

Story first published: Friday, September 14, 2018, 19:37 [IST]
Other articles published on Sep 14, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+