ఆసియా కప్ చరిత్ర, మ్యాచ్ రికార్డులు, గణాంకాలను తెలుసుకోండి

హైదరాబాద్: సెప్టెంబరు 15 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగే ఆసియా కప్ గురించే క్రికెట్ అభిమానులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఈ ఆసియా కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును సెలక్టర్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
దీంతో ఆసియా కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్‌తో భారత జట్టు రెండు లేదా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. దీంతో కోహ్లీ లేని టీమిండియా ఎలా ఆడుతుందోననే అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆసియా కప్‌లో భారత్ సహా ఆరు జట్లు పోటీపడనున్నాయి.
ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. టాప్-2లో నిలిచిన రెండు జట్లు కూడా సూపర్-4 స్టేజికి అర్హత సాధిస్తాయి. ఈసారి ఆసియా కప్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...

1984లో తొలి ఆసియా కప్
* మొట్టమొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక అయింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి.
* ఇప్పటివరకు 13 సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. భారత జట్టు ఆరు సార్లు ఆసియా కప్‌ను ఎక్కువ సార్లు కైవసం చేసుకుంది. భారత్ ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలవగా, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ఈ ట్రోఫీని నెగ్గాయి.
* బంగ్లాదేశ్ అత్యధికంగా ఐదు సార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది.
* 2014 వరకు జరిగిన ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించేవారు. 2015 నుంచి ఈ టోర్నీని వన్డే, టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.

టీ20 ఫార్మాట్‌లో తొలిసారి
* 2016లో మొట్టమొదటిసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు.
* ఆసియా కప్ టోర్నీలో 13 సార్లు పాల్గొన్న ఏకైక జట్టుగా శ్రీలంక అరుదైన ఘనత సాధించింది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్టు 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఈ టోర్నీలో ఆడిన మిగతా ఆసియా జట్లుగా యుఏఈ (3 సార్లు), హాంకాంగ్ (2 సార్లు), ఆప్ఘనిస్థాన్ (ఒకసారి) నిలిచాయి.
* ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య (25 మ్యాచ్‌ల్లో 1196 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
* ఆసియా కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్ (24 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా
* ఒక ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సనత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు (2008లో జరిగిన ఎడిషన్‌లో జయసూర్య 378 పరుగులు చేశాడు).
* ఒక సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంకకు చెందిన అజంతా మెండిస్ నిలిచాడు (2008 ఎడిషన్ అజంతా మెండిస్ 17 వికెట్లు తీశాడు).
* 2012లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ చేసిన 183 పరుగులే టోర్నీలో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు.
* ఆసియా కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సనత్ జయసూర్య నిలిచాడు. ఆసియా కప్‌లో సనత్ జయసూర్య చేసిన సెంచరీలు సంఖ్య 6.

అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా
* ఆసియా కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ రికార్డు నమోదు చేశాడు. మలింగ 3 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
* ఆసియా కప్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా మహిళా జయవర్దనే నిలిచాడు. టోర్నీలో జయవర్దనే మొత్తం 15 క్యాచ్‌లు అందుకున్నాడు.
* 385/7 - 2010లో జరిగిన ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ జట్టు నమోదు చేసిన స్కోరు. ఇప్పటివరకు, ఇదే ఆసియా కప్ టోర్నీలో అత్యధిక స్కోరు.
* 87 ఆలౌట్ - ఆసియా కప్‌లో అతి తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.
* మహ్మద్ అజహరుద్దీన్, మర్వన్ ఆటపట్టులు మాత్రమే ఆసియా కప్ ఫైనల్లో రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications