Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షోయబ్ మాలిక్ క్యాచ్‌ మిస్ చేసిన ధోని: భారత్ మూల్యం చెల్లించనుందా?

Asia Cup 2018: Dhoni Drops a Sitter of Malik, Will it Cost India?

హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ఓ క్యాచ్‌ని జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలో రెండు వికెట్లు తీసి భువనేశ్వర్ కుమార్ పాక్‌కి షాకిచ్చాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షోయబ్ మాలిక్ బంతిని అంచనా వేయడంలో తడబడ్డాడు. పాండ్యా వేసిన లెంగ్త్ బంతిని మాలిక్ పాయింట్ దిశగా నెట్టేందుకు ప్రయత్నించాడు.

అదే బ్యాట్ ఎడ్జి తీసుకున్న బంతి వెనక్కి వెళ్లింది. దీనిని క్యాచ్‌గా అందుకునే క్రమంలో ధోని కుడివైపునకి డైవ్ చేశాడు. బంతి ధోని చేతుల్లో పడి.. మళ్లీ ఎగిరి కింద పడిపోయింది. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి క్యాచ్‌లను అలవోకగా పట్టేసిన ధోని ఈ మ్యాచ్‌లో మాలిక్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు.

Story first published: Wednesday, September 19, 2018, 19:01 [IST]
Other articles published on Sep 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+