Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్గాన్‌తో మ్యాచ్: టీమిండియాతో గెలవలేకపోవటానికి కారణాలివే!!

ASIA CUP 2018 : It Must Be A Special Day For Afghanistan
Asia Cup 2018: 3 reasons why India couldnt win against Afghanistan

న్యూ ఢిల్లీ: ఆసియా కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియాకు అఫ్గాన్‌తో మ్యాచ్ గెలవడం పెద్ద విషయమేమీ కాదనిపించింది. ఇప్పటికే ఫైనల్ వెళ్లేందుకు టీమిండియా స్థానం ఖరారవడంతో.. నామమాత్రమైన మ్యాచ్‌లో ఆడనున్న జట్టులో మార్పులు చేసింది. ఇన్ని మార్పులు చేపట్టినప్పటికీ భారత్ గెలవలేకపోవడంపై 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

షెహ్‌జాద్ క్యాచ్‌ను అందుకోలేకపోవడం:

షెహ్‌జాద్ క్యాచ్‌ను అందుకోలేకపోవడం:

మొహమ్మద్ షెహ్‌జాద్ తానొక్కడే అఫ్గాన్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. కేవలం 116 బంతుల్లో 124పరుగులను చేసి టీమ్ స్కోరు పెంచాడు. తొమ్మిదో ఓవర్లో సిద్దార్థ్ కౌల్ బౌలింగ్ వేస్తున్నాడు. షెహ్‌జాద్ 49పరుగుల వద్ద స్కోరు ఉండగా మిడ్ ఆఫ్‌లో కొట్టిన షాట్‌ను అంబటి రాయుడు అందుకోలేకపోయాడు. అప్పుడు కనుక అది పట్టేసి ఉంటే కచ్చితంగా భారత్‌కు ఒక వికెట్ వచ్చేసి ఉండేది. ఆ తర్వాత ప్రత్యర్థి ఇచ్చిన తక్కువ టార్గెట్ ను టీమిండియా సులువుగా చేధించగలిగేది.

అంపైరింగ్ లోపం, వృథా రివ్యూ:

అంపైర్‌ నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికి రివ్యూ లేకపోవడంతో ధోని మైదానాన్ని వీడాల్సి రివ్యూ మిగిలివుంటే ధోని అవుటయ్యేవాడు కాదని, మ్యాచ్‌ టై గా ముగిసేది కాదని అభిమానుల వాదన. అయితే ఇంగ్లాండ్‌ సిరీస్‌లోనూ రివ్యూ సరిగ్గా ఉపయోగించకుండా వృథా చేశాడని నెటిజన్లు గుర్తుచేశారు. రాహుల్‌ డీఆర్‌ఎస్‌ ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడంటున్నారు.

డెత్ ఓవర్లలో సత్తా చాటిన అఫ్గాన్

డెత్ ఓవర్లలో సత్తా చాటిన అఫ్గాన్

భారత్ చేసిన తప్పిదాలకు తగ్గట్టు డెత్ ఓవర్లలో అఫ్గాన్ బౌలర్లు మాయ చేశారు. భారత్ టార్గెట్ చేరుకోకుండా ఉండాలని సర్వత్రా ప్రయ్నతాలు జరిపారు. ఈ క్రమంలో అస్గర్ కెప్టెన్సీలో అఫ్గాన్ స్పిన్నర్లను చివరి వరకూ ఉంచి మ్యాచ్‌ను అదుపు చేయగలిగాడు. పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్ నుంచి తెలుసుకున్న కెప్టెన్ స్పిన్నర్లను ఆపాడు. అదీ కాకుండా రషీద్ ఖాన్‌కు చివరి ఓవర్ ఇప్పించడం విశేషం.

50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు

50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు

ఇలా ముందు బ్యాటింగ్ చేసిన మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌కు రాహుల్‌, రాయుడు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన రాయుడు సిక్స్‌లతో చెలరేగాడు. రాహుల్‌ 55 బంతుల్లో అర్ధసెంచరీ సాధిస్తే.. రాయుడు 43 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే జోరులో మరో భారీ షాట్‌కు వెళ్లిన రాయుడు క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. కాసేపటికే రాహుల్‌ కూడా అతణ్ని అనుసరించాడు. వీళ్లిద్దరు ఔటయ్యాక భారత రన్‌రేట్‌ తగ్గింది. దీనికి తోడు ధోని (8), పాండే (8), జాదవ్‌ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కీలక సమయంలో కార్తీక్‌ (44) ఔట్‌ కావడంలో ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి మ్యాచ్‌ టై అయింది.

Story first published: Wednesday, September 26, 2018, 16:57 [IST]
Other articles published on Sep 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+