పాక్ ఓటమి: బెట్టు కట్టిన అభిమాని ఆత్మహత్య
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2016 టీ20లో భాగంగా బుధవారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో తమ దేశ జట్టు గెలుస్తుందని ఓ పాకిస్థాన్ అభిమాని తన నెల జీతాన్ని పందెం(బెట్) కాసాడు. అయితే ఈ మ్యాచులో పాకిస్థాన్ ఓటమిపాలు కావడంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పంజాబ్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న ముహమ్మద్ షఫీక్ (50) తన కార్యాలయంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కథనాన్ని పాకిస్థాన్ పత్రిక డాన్ ప్రచురితం చేసింది.
పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోవడంతో షఫీక్ తన జీతం రూ. 30వేలను కోల్పోవాల్సి వచ్చిందని, దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని సోదరుడు ముహమ్మద్ రంజాన్ తెలిపాడు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Pakistani man loses bet, commits suicide
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications