Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచూరియన్‌ టెస్టులో అశ్విన్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

ashwin worst bowling record in second innings, centurion test

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఓ వికెట్‌ తీయడానికి 177(29.3 ఓవర్లు) బంతులు సంధించాడు.

తద్వారా విదేశీ పిచ్‌లపై రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయడానికి అశ్విన్‌ అత్యధిక బంతుల్ని తీసుకున్న బౌలర్‌గా చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు. మొత్తంగా చూస్తే ఇది అశ్విన్‌కు మూడో చెత్త ప్రదర్శన. గతంలో 2012లో అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అశ్విన్‌ వికెట్‌ తీయడానికి 257 బంతులు తీసుకున్నాడు.

అంతకముందు 2011లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తీసేందుకు గాను 215 బంతులు సంధించాడు. ఇదిలా ఉంటే సెంచూరియన్ టెస్టులో కోహ్లీసేనకు దక్షిణాఫ్రికా 287 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

నాలుగో రోజైన మంగళవారం 90/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 168 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్(80), కెప్టెన్ డుప్లెసిస్(48) రాణించగా... మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా 91.1 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆరంభం నుంచే తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికి సింగిల్ తీసి భారత్ పరుగుల ఖాతాను తెరిచిన మురళీ విజయ్.. రబడ బౌలింగ్‌లో ఫోర్ బాదాడు. ఆ తర్వాత మురళీ విజయ్ (9) పరుగుల వద్ద రబడ వేసిన బంతిని వికెట్ల మీదగా ఆడటంతో తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (4) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న భారత్‌ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కోహ్లీ, పుజారాల జోడీ ఆదుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే బౌండరీతో పరుగుల ఖాతాను తెరిచిన కోహ్లీని ఎంగ్డీ తన లైన్ అండ్ లెన్త్ బంతులతో ఇబ్బంది పెట్టాడు.

ఈ సమయంలో ఎంగ్డీ విసిరిన బంతికి విరాట్ కోహ్లీ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ రివ్యూకు వెళ్లినప్పటికీ థర్డ్ అంఫైర్ ఔట్‌గానే ప్రకటించాడు. దీంతో నాలుగో రోజు పుజారాకు జత కలిసిన పార్థివ్ ఆట ముగిసే వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రస్తుతం 23 ఓవర్లకు గాను భారత్ 35/3తో నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 17, 2018, 10:35 [IST]
Other articles published on Jan 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+