అశ్విన్ త్యాగాన్ని గుర్తించిన అంపైర్లు.. డగౌట్‌కు వెళ్తుంటే ఆపి మళ్లీ బ్యాటింగ్ చేయించారు

లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ చేయాలనుకున్న త్యాగం ఫలించలేదు. తొలుతు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 17.3ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 152పరుగుల వద్ద కొనసాగుతుంది. ఆ టైంలో క్రీజులో జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఇక ఆ ఓవర్ లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని అశ్విన్ కవర్ దిశగా స్ట్రైక్ ఆడాడు. ఇక వెనువెంటనే రన్ తీయాలనే ఆలోచనలో బౌలింగ్ ఎండ్ లో ఉన్న నీషమ్, అశ్విన్ పరుగు ప్రారంభించారు.
కానీ బంతి కవర్లో నేరుగా కెప్టెన్ రాహుల్ చేతిలోకి వెళ్లడంతో అతను వెంటనే బంతిని బౌలర్ రవి బిష్ణోయ్‌కు విసిరాడు. ఇక రనౌట్ ఎలాగూ తప్పదనే క్రమంలో నీషమ్ ఉంటే ఇంకాస్త స్కోరు పెంచొచ్చని తాను అవుట్ కావాలని అశ్విన్ బౌలర్ ఎండ్ వైపు పరుగుతీశాడు. అప్పటికే రవి బిష్ణోయ్ వికెట్లను గిరటేశాడు. దీంతో రనౌట్ అయినట్లు భావించిన అశ్విన్ పెవిలియన్ వైపు నడిచాడు.

అశ్విన్‌ను ఆపిన అంపైర్లు
తన వికెట్ త్యాగం చేసినా పర్లేదు క్రీజులో నీషమ్ ఉంటే ఇంకాస్త స్కోరు ఎక్కువ వస్తుందని అశ్విన్ భావించి అవుట్ అయ్యాననే ఫీలింగ్‌తో డగౌట్ వైపు నడుస్తుండగా.. అంపైర్లు ట్విస్ట్ ఇచ్చారు. ఈ రనౌట్లో ఇంతకు అశ్విన్ ఔటయ్యాడా లేదా నీషమ్ ఔటయ్యాడా అనే దాన్ని చెక్ చేసేందుకు థర్డ్ అంపైర్‌కు గ్రౌండ్ అంపైర్లు రిఫర్ చేశారు.
ఇక రిప్లేలో చూసేసరికి పిచ్‌లో అశ్విన్, నీషమ్ ఒకరినొకరు క్రాస్ కాలేదని కన్పించింది. దీంతో అశ్విన్ రనౌట్ కాలేదని, నీషమ్ ఔటని థర్డ్ అంపైర్ పేర్కొనడంతో నీషమ్ పెవిలియన్ బాటపట్టాడు. రూల్స్ ప్రకారం.. రనౌట్ అయినప్పుడు ఇద్దరు బ్యాటర్లలో ఒకరినొకరు క్రాస్ అయినప్పుడే ఏ వైపు రనౌట్ జరిగిందో ఆ వైపు పరిగెత్తిన ప్లేయర్ అవుట్ అవుతాడు.

అయినా పెద్ద నష్టం జరగలేదు
ఇన్నింగ్స్‌ను పటిష్టంగా ముగించే ప్రయత్నంలో అశ్విన్ తన వికెట్‌ను త్యాగం చేసేందుకు ప్రయత్నించగా అది బెడిసికొట్టింది. కానీ రాజస్థాన్ కు మాత్రం పెద్ద నష్టమేం జరగలేదు. జిమ్మీ నీషమ్ (14పరుగులు 12బంతుల్లో) ఔటయినప్పటికీ.. మిగిలిన 2.2ఓవర్లలో రాజస్థాన్ 26పరుగులు పిండుకుంది. దీంతో నిర్ణీత 20ఓవర్లు ముగిసేసరికి స్కోరు 178కి చేరుకుంది. దీంతో 179పరుగుల టఫ్ టార్గెట్ లక్నో ముందుంచింది.

ఈ విజయంతో టాప్ 2 స్థానంలోకి
ఛేదనలో లక్నో బ్యాటర్లో దీపక్ హుడా (59పరుగులు 39బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) పోరాటం చేసినా అది సరిపోలేదు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోవడంతో ఆర్ఆర్ చేతిలో లక్నో 24పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దీంతో 8విజయాలతో ఆర్ఆర్ ప్లేఆఫ్ రేసులో దాదాపు బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక ఆర్ఆర్ నెట్‌రన్‌రేట్ కూడా పాజిటివ్‌గా ఉండడం వల్ల ఆర్ఆర్, లక్నో సేమ్ పాయింట్లతో (16)తో ఉన్నప్పటికీ లక్నో(3వ స్థానం) కంటే ఒక స్థానం మెరుగ్గా 2వ స్థానంలో రాజస్థాన్ ఉంది. ఇక పాయింట్ల టేబుల్లో టాప్ 1గా గుజరాత్ ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications