విశాఖపట్నం: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం ఐఎన్ఎస్ జలాశ్వను సందర్శించాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తూర్పు నావికాదళం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
అత్యధిక వికెట్లు: అశ్విన్ ఖాతాలో మరో రికార్డు
తూర్పు నావికాదళం ఛీఫ్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తా అశ్విన్‌ను సాదరంగా ఆహ్వానించి జలాశ్వలోకి తీసుకువెళ్ళారు. రెండో టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అశ్విన్‌ను ఆయన కొనియాడారు. దీపావళి సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన 'Sandesh2Soldiers' పిలుపు మేరకు అశ్విన్ ఐఎన్ఎస్ జలాశ్వను సందర్శించారు.

ఇందులో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వలోని నావికులు, అధికారులతో అశ్విన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కొద్దిసేపు అశ్విన్ ముచ్చటించాడు. దేశ రక్షణలో సోల్జర్ల పాత్రను కొనియాడారు. చెన్నై నగరానికి వరదలు వచ్చినప్పుడు ఢిఫెన్స్ సిబ్బంది కాపాడిన తీరు అద్భుతమని ప్రశంసించాడు.
ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా 'Sandesh2Soldiers'లో భాగంగా దేశ రక్షణ దళ ప్రతినిధులతో కాఫీ తీసుకోవాలన్న తన కోరికగా పేర్కొన్నానని, అయితే ఇంత త్వరగా నౌకాదళ ప్రతినిధులను కలవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అశ్విన్ చెప్పాడు.
భారత్ విజయం: కోహ్లీపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారు
అశ్విన్ ఐఎన్ఎస్ జలాశ్వను సందర్శించిన సందర్భంగా ఆటోగ్రాఫ్‌తో కూడిన బ్యాట్‌ను తూర్పు నావికాదళం ఛీఫ్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తాకు అందజేశారు. దీనికి సంబంధంచిన ఫోటోను అశ్విన్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.