పిచ్‌పై పిచ్చి వ్యాఖ్యలు: సమర్ధించుకున్న అశ్విన్
విశాఖపట్నం: భారత్‌లో టెస్టు సిరిస్ అంటే ప్రతి ఒక్కరూ పిచ్‌పైనే దృష్టి సారిస్తారు. ముఖ్యంగా భారత్‌లో స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లు ఉంటాయనే అపవాదు ఉంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టుపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.

మేం బాగా బౌలింగ్ చేయడంతోనే మ్యాచ్‌పై పట్టు సాధించాం
విశాఖ పిచ్ మాకు అనుకూలించడం కాదని, మేం బాగా బౌలింగ్ చేయడంతోనే మ్యాచ్‌పై పట్టు సాధించామని అశ్విన్ పేర్కొన్నాడు. మీడియాకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇక ఏదో ఒక రోజు పిచ్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మానేస్తానని అశ్విన్ చెప్పాడు. మేం వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయడం వల్లే పట్టు సాధించామన్నాడు.

బ్యాటింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం
బ్యాటింగ్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని, గతంలో ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు కూడా చక్కగా బ్యాటింగ్ చేశానని అశ్విన్ చెప్పాడు. ఇంగ్లాండ్‌పై మంచి రికార్డు ఉండటం మానసికంగా తనకు లాభించేదేనని అశ్విన్ స్పష్టం చేశాడు. గతం కంటే మెరుగ్గా ఆడాలని ఎప్పుడూ కోరుకుంటానని అన్నాడు.

భారత్‌లో ఉండే సంప్రదాయ వికెట్
తనతో తానే పోటీ పడతానని చెప్పిన అశ్విన్... భారత్‌లో ఉండే సంప్రదాయ వికెట్ ఇది అని అన్నాడు. పిచ్ గురించి అన్నీ అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నాడు. రెండు, మూడేళ్ళ క్రితం జయంత్ యాదవ్ చెన్నై వచ్చినప్పుడు మా ఇంట్లో 10 రోజులున్నాడు. నాతో కలిసి ప్రాక్టీసు చేశాడు.

మా ఇద్దరి మధ్య సమన్వయం ఉంది
మా ఇద్దరి మధ్య సమన్వయం ఉందని, తాను చెప్పేది బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టే అర్ధ సెంచరీ చేయడాన్ని బాగా ఆస్వాదించానని తెలిపాడు. తొలి టెస్టు ఆడుతున్న జయంత్‌కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు. బ్యాటింగ్‌లో రాణించడమే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications