'బౌలింగ్ చేసేటప్పుడు అశ్విన్ బ్యాట్స్‌మెన్‌లా ఆలోచిస్తాడు'
హైదరాబాద్: బౌలింగ్ చేసేటప్పుడు టీమిండియా టాప్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్స్‌మెన్‌లా ఆలోచిస్తాడని భారత స్టార్ ఆటగాడు పుజారా అన్నాడు. ఆదివారం మీడియాతో మాట్లాడిన పుజారా బ్యాట్స్‌మన్ తరహాలో ఆలోచించి బంతులు వేయడమే అశ్విన్‌ను తెలివైన బౌలర్‌గా నిలబెడుతందని చెప్పాడు.
'ఎంతటి ప్రత్యర్థికైనా అశ్విన్ కఠినమైన స్పిన్నరే. 250 వికెట్లు తీసిన అశ్విన్‌కు శుభాకాంక్షలు. అందుకే ఏ జట్టయినా అశ్విన్‌ను ఎలా ఎదుర్కోవాలో అన్నదానిపైనే కసరత్తులు చేస్తున్నాయి. బ్యాట్స్‌మన్ తరహాలో ఆలోచించే అశ్విన్.. బ్యాట్స్‌మెన్ బలహీనతలను పసిగట్టి అక్కడే బంతులేసి ఫలితం సాధిస్తాడు. అనుభవమే అతన్ని జట్టులో ప్రధాన బౌలర్‌గా చేసింది' అని చెప్పాడు.

ప్లానింగ్‌తో అశ్విన్ బౌలింగ్
ప్లాన్‌తో బౌలింగ్ చేస్తాడు. కొన్ని పరిస్థితుల్లో అతడు వికెట్లు తీయలేకపోవచ్చని, అయితే పిచ్‌పై పగుళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని పుజారా వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ రెండు వికెట్లు మాత్రమే తీసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అశ్విన్‌ను పుజారా వెనకేసుకొచ్చాడు.

రెండో సెషన్ లోపు టీమిండియాకు విజయం
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో చివరి రోజైన సోమవారం రెండో సెషన్ లోపు టీమిండియాకు విజయం ఖాయమవుతుందని పుజారా విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘పిచ్‌పై బంతి తిరగడం మొదలైంది. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడతారు. మిగిలిన ఏడు వికెట్లు రెండు సెషన్స్‌లో లభిస్తాయని అనుకుంటున్నా' అని పుజారా అన్నాడు.

దూకుడుగా ఆడటానికి బలమైన కారణాలున్నాయి
మరోవైపు బంగ్లా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడటానికి బలమైన కారణాలే ఉన్నాయని పుజారా చెప్పుకొచ్చాడు. 'నేను ఒక టెస్టు ఆటగాడిని అనే ముద్ర ఉంది. ఆ ముద్ర సాధ్యమైనంత తొందరగా చెరిగిపోవాలి. నేను అన్ని ఫ్మార్మాట్లకు సరిపోతాననే విషయం తెలుసు. ఆ క్రమంలోనే దూకుడైన ఆటను ఆడుతున్నా' అని పుజారా పేర్కొన్నాడు.

58 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 54 పరుగులు
రెండో ఇన్నింగ్స్‌లో 58 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 54 పరుగులతో పుజారా నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications