Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

300 వికెట్ల ప్రత్యేకం: అశ్విన్ ఓ సూపర్ హీరో

Ashwin the unassuming superhero
R Ashwin surpasses Anil Kumble, Kapil Dev to break records | Oneindia News

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ రికార్డుని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 54 టెస్టుల్లోనే 300 వికెట్లు తీసి.. అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన బౌలర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు.

30 మంది బౌలర్లు మాత్రమే 300కుపైగా

అశ్విన్‌ కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 30 మంది బౌలర్లు మాత్రమే 300కుపైగా వికెట్లు తీశారు. అయితే ఈ అరుదైన రికార్డుని అందుకోవడానికి అందరి కంటే తక్కువ టెస్టులు ఆడింది మాత్రం అశ్వినే కావడం విశేషం. రెండో టెస్టులో చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు 8 వికెట్ల దూరంలో ఉన్న అశ్విన్... తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును సృష్టించాడు.

హ్యాండ్ షేక్స్, హగ్స్‌తో

నాగ్‌పూర్ టెస్టులో అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పినప్పటికీ, కోహ్లీ డబుల్ సెంచరీతో తెరమరుగైందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరైనా క్రికెటర్ ప్రపంచ రికార్డు నెలకొల్పితే అతన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. అయితే నాగ్‌పూర్ టెస్టులో ఇందుకు భిన్నంగా జరిగింది. రెండో టెస్టులో చివరి వికెట్ తీసుకున్న అనంతరం జట్టులోని సహచర ఆటగాళ్లు హ్యాండ్ షేక్స్, హగ్స్‌తో మాత్రమే అశ్విన్‌కు అభినందనలు తెలిపి మైదానాన్న వీడారు.

అభిమానులు సైతం ఆవేదన

అభిమానులు సైతం ఆవేదన

అయితే ప్రపంచ క్రికెట్‌లో డెన్నిస్‌ లిల్లీ, మురళీధరన్‌, రిచర్డ్‌ హ్యాడ్లీ, మాల్కం మార్షల్‌, డేల్‌ స్టెయిన్‌, షేన్‌ వార్న్‌, అలన్‌ డొనాల్డ్‌ లాంటి బౌలర్లకు సాధ్యం కాని రికార్డుని బద్దలు కొట్టిన అశ్విన్‌ను అభినందించిన తీరుని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మోడ్రన్ డే క్రికెట్ బౌలర్లలో అశ్విన్ నాణ్యమైన బౌలరే కాదు, బ్యాట్స్‌మెన్ కూడా. మైదానంలో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ వేస్తాడు. క్యారమ్‌ బంతి, ఆర్మ్‌ బంతి వేయడంలో అశ్విన్ దిట్ట. రెండో టెస్టులో అశ్విన్‌ తీసిన 300వ వికెట్‌ కూడా క్యారమ్‌ బంతే కావడం విశేషం.

ఈ ఏడాది ఇప్పటికే 50 వికెట్లు

ఈ ఏడాది ఇప్పటికే 50 వికెట్లు

ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం అశ్విన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అశ్విన్ సంధించే బంతుల్లో వైవిధ్యమూ ఎక్కువగా ఉంటుంది. ఒకే బంతిని కుడిచేతివాటం, ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్‌లకు భిన్నంగా వేయగలడు. 2015, 16లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు పొందాడు. 2015లో 9 టెస్టులాడిన అశ్విన్ 62 వికెట్లు తీయగా, 2016లో 12 టెస్టుల్లో 72 వికెట్లు తీశాడు. ఇక, ఈ ఏడాది ఇప్పటికే 50 వికెట్లు అశ్విన్ ఖాతాలో చేరాయి. ఎప్పటికప్పుడు బౌలింగ్‌కు మెరుగులు దిద్దుకోవడం.. బంతుల్లో వైవిధ్యాన్ని చూపించడం అశ్విన్ ప్రత్యేకత.

ప్రధాన బౌలర్‌గా అశ్విన్ ఎదిగిన తీరు అద్భుతం

ప్రధాన బౌలర్‌గా అశ్విన్ ఎదిగిన తీరు అద్భుతం

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ కూడా ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అశ్విన్ టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటికే టెస్టుల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపెడుతుంటాడు. 54 టెస్టుల్లో 31.55 యావరేజితో 2051 పరుగులు చేశాడు. ఇప్పటివరకు టీమిండియా చూసిన స్పిన్నర్లతో పోలిస్తే అశ్విన్ ఎంతో ప్రత్యేకం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Story first published: Tuesday, November 28, 2017, 12:38 [IST]
Other articles published on Nov 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+