Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!

Ashwin talks about Kishan vs Dhawan debate

ఏ ఆటగాడి విషయంలో అయినా కేవలం ఒక్క మ్యాచ్‌లో అతని ఆట చూసి ఒక నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇషాన్ కిషన్, శిఖర్ ధవన్‌లలో ఎవరిని జట్టులో ఉంచాలని జరుగుతున్న డిబేట్‌పై అశ్విన్ ఇలా స్పందించాడు. గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్ రాణించాడు. మూడో వన్డేలో అతనికి అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో ధవన్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన కిషన్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు.

కిషన్ మ్యాజిక్..

కిషన్ మ్యాజిక్..

అదే మ్యాచ్‌లో శిఖర్ ధవన్ కేవలం 3 పరుగులే చేశాడు. బంగ్లా పర్యటనలో అతను ఏమాత్రం రాణించలేదు. మూడు వన్డేల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.

సెలక్టర్లు కూడా 37 ఏళ్ల ధవన్‌ను జట్టులో నుంచి తప్పించేశారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. దీనిపైనే అశ్విన్ మాట్లాడుతూ.. ఒక మ్యాచ్‌లో రాణించడం కాకుండా.. లాంగ్‌రన్‌లో జట్టుకు ఉపయోగపడేలా ఎవరు ఆడతారని ఆలోచించి సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని అన్నాడు.

సైలెంట్ కిల్లర్..

సైలెంట్ కిల్లర్..

టీమిండియా ఎప్పటి నుంచో ఎక్కువగా టాపార్డర్ మీదనే ఆధార పడుతూ వస్తోందని అశ్విన్ గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా జట్టు చేసే పరుగుల్లో అత్యధిక భాగం మొదటి ముగ్గురు బ్యాటర్లే చేస్తారని చెప్పాడు. 'మనందరం రోహిత్, కోహ్లీ గురించి బాగా మాట్లాడుకుంటాం. కానీ ధవన్ కూడా గొప్ప బ్యాటరే. అతను సైలెంట్‌గా తన పని చేసుకుపోతాడు. టీమిండియాలో అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు కదా. ఆ లోటు అసలు తీరుతుందా?' అని అడిగాడు.

 ధవన్‌ను తీసుకోవాలా?

ధవన్‌ను తీసుకోవాలా?

ధవన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలా? లేక కిషన్‌ను సిద్ధం చేయాలా? అనేది ఇప్పుడు జట్టులో ప్రధాన ప్రశ్నగా మారింది. కిషన్ డబుల్ సెంచరీ చేయడంతోనే అతనిపై అందరి ఫోకస్ పడింది. 'భారీ స్కోరు చేసిన ఆటగాడి కన్నా కూడా జట్టుకు ఏం అవసరమో చూడాలి.

ఎవరైతే ఒత్తిడిలో కూడా ఎవరు ఆడతారు? ఎక్కువ కాలం జట్టుకు ఎవరు సేవలు అందిస్తారు? అని ఆలోచించాలి' అని అశ్విన్ చెప్పాడు. అయితే లంక వన్డే సిరీస్‌లో కిషన్‌ను కాదని, శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవడం గురించి కూడా అతను మాట్లాడాడు. గిల్ ధారాళంగా పరుగులు చేశాడని, అందుకే అతన్ని ఎంపిక చేశారని తేల్చేశాడు.

Story first published: Sunday, January 29, 2023, 12:08 [IST]
Other articles published on Jan 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+