INDvsAUS : స్మిత్‌కు వార్నింగ్ ఇచ్చిన అశ్విన్.. పగలబడి నవ్విన కోహ్లీ.. వీడియో వైరల్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తెలివితేటలకు పెట్టింది పేరు. అతని వల్లనే క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పుకునే 'మన్కడింగ్'ను ఐసీసీ కూడా రనౌట్‌గా మార్చింది. ఆస్ట్రేలియాతో జరిగితన రెండో టెస్టులో కూడా అశ్విన్ ఇలాగే తన తెలివి ప్రదర్శించాడు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా.. మార్నస్ లబుషేన్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. అప్పుడు అశ్విన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో స్టీవెన్ స్మిత్ నిలబడి ఉన్నాడు.
అశ్విన్ బంతి వేయడానికి ముందుకు రాగానే స్మిత్ కూడా అలవాటులో పొరపాటుగా క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. అయితే అశ్విన్ ఇది చూడకుండా ఉంటాడా? అందుకే బంతి విసరకుండా చటుక్కున వెనక్కు తిరిగి స్మిత్ వైపు చూశాడు. అది చూసిన స్మిత్ గబుక్కున వెనక్కు తిరిగి క్రీజులోకి పరిగెత్తాడు. అప్పుడు అశ్విన్ నవ్వుతూ మళ్లీ బౌలింగ్ చేయడానికి వెళ్లాడు.
తనను అవుట్ చేయకుండా అలా వార్నింగ్ ఇచ్చినందుకు స్మిత్ కూడా అశ్విన్‌కు థంబ్స్ అప్ చూపించాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఇదంతా చూస్తున్న కోహ్లీ తన నవ్వును ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కాగా, క్రికెట్‌లో మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడానికి కారణం ఎవరు? అంటే అందరూ చటుక్కున అశ్విన్ పేరునే చెప్తారు. ఈ వెటరన్ స్పిన్నర్ తన మన్కడింగ్‌లతో ఆట గమనాన్నే మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఐపీఎల్‌లో కూడా అలాగే చేశాడు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగడం గమనించిన ఐసీసీ కూడా తమ రూల్స్ సవరించి మన్కడింగ్‌ను నాన్‌స్ట్రైకర్ రనౌట్‌గా మార్చేసింది. దీంతో మరికొంత మంది కూడా ఇలా ప్రత్యర్థులను అవుట్ చేస్తున్నారు. దీనికితోడు నాన్ స్ట్రైకర్ బ్యాటర్లు కూడా తమ క్రీజు దాటి ముందుకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications