అశ్విన్ బంతికి విండీస్ విలవిల: 63ఏళ్లకు కోహ్లీ సేన రికార్డు గెలుపు
అంటిగ్వా: కరీబియన్ గడ్డపై భారత్ ఘనమైన బోణీ కొట్టింది. ఆతిథ్య వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో 63 ఏళ్లుగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్‌కు తొలిసారి ఇన్నింగ్స్ విజయాన్ని సాధించినట్లయింది.
323 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 231 పరుగులకే ఆలౌట్ చేసింది. అశ్విన్ 7 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు.
మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసి, ఆ జట్టును ఫాలోఆన్‌లోకి నెట్టిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగిపోయారు. భారత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. బంతితోనూ విజృంభించాడు. అతను 25 ఓవర్లలో 87 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విలవిలలాడిన విండీస్.. 78 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది.

కోహ్లీ సేన అద్భుత విజయం
కరీబియన్ గడ్డపై భారత్ ఘనమైన బోణీ కొట్టింది. ఆతిథ్య వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

కోహ్లీ సేన అద్భుతం విజయం
దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో 63 ఏళ్లుగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్‌కు తొలిసారి ఇన్నింగ్స్ విజయాన్ని సాధించినట్లయింది.

కోహ్లీ సేన అద్భుత విజయం
323 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 231 పరుగులకే ఆలౌట్ చేసింది. అశ్విన్ 7 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు.

టీమిండియా ఇన్నింగ్స్ విజయం
తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్ చేసి, ఆ జట్టును ఫాలోఆన్‌లోకి నెట్టిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగిపోయారు.

కోహ్లీ సేన విజయం
భారత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. బంతితోనూ విజృంభించాడు.

అశ్విన్ ధాటికి విండీస్ విలవిల
అశ్విన్ 25 ఓవర్లలో 87 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విలవిలలాడిన విండీస్.. 78 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది.
శామ్యూల్స్ (50), కార్లోస్ బ్రాత్‌వైట్ (51 నాటౌట్), బిషూ (45) మాత్రమే కాస్త పోరాడారు. అంతకుముందు మూడో రోజు షమి (4/66), ఉమేశ్ యాదవ్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 243 పరుగులు చేసి ఆలౌటైంది. లోయరార్డర్లో డౌరిచ్ (57), హోల్డర్ (36) పోరాడటంతో విండీస్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. కోహ్లి వెంటనే విండీస్‌ను ఫాలోఆన్ ఆడించాడు. ఆట ఆఖరుకు ఆతిథ్య జట్టు 21/1తో నిలిచింది.
ఇషాంత్.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (2)ను ఔట్ చేసి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ పతనానికి తెరతీశాడు. నాలుగో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్.. ఆరంభంలో పర్వాలేదనిపించింది. ఓపెనర్ చంద్రిక (31), శామ్యూల్స్ నిలకడగా ఆడటంతో ఓ దశలో 88/2తో నిలిచింది.
అయితే ఇక్కడే అశ్విన్ మాయాజాలం మొదలైంది. అతను చంద్రికను ఔట్ చేసి పతనానికి బాటలు వేశాడు. అశ్విన్ ధాటికి విండీస్ 44 పరుగుల తేడాలో 6 వికెట్లు కోల్పోయిన విండీస్ ఓ దశలో 132/8తో నిలిచింది. అయితే కార్లోస్ బ్రాత్‌వైట్, బిషూ తొమ్మిదో వికెట్‌కు 95 పరుగులు జోడించి భారత విజయాన్ని ఆలస్యం చేశారు. టీ విరామం తర్వాత అశ్విన్ ఒకే ఓవర్లో బిషూ, గాబ్రియల్ (4)ను ఔట్ చేసి విండీస్ ఇన్నింగ్స్‌ను ముగించేశాడు.
కాగా, ఆసియా ఖండం దాటి టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్లు అశ్విన్, షమీ, ఉమేశ్ యాదవ్‌లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications