వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్: కౌంటీ క్రికెట్‌కు సిద్ధమైన అశ్విన్

హైదరాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా అశ్విన్ ఇంగ్లాండ్‌కు పయనం కానున్నాడు. కౌంటీ క్రికెట్‌లో అశ్విన్ నాటింగ్‌హామ్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టులో వెస్టిండిస్‌తో టీమిండియా టెస్టు సిరిస్ ఆడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

నాటింగ్‌హామ్‌షైర్ తరఫున అశ్విన్ ఆరు మ్యాచ్‌లు
ఈ టెస్టు సిరిస్ కోసం తన బౌలింగ్‌ను మరింత సానబెట్టేందుకు అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున అశ్విన్ ఆరు మ్యాచ్‌లు ఆడనున్నాడు. "ఔను.. అశ్విన్ ఈ కౌంటీ సీజన్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున బరిలోకి దిగుతాడు. పరిపాలక కమిటీ (సీఓఏ) ఇప్పటికే సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లకు కౌంటీలాడేందుకు గ్రీన్ సిగ్నలిచ్చింది. అశ్విన్ ఒప్పందం ఇప్పటికే ఖరారైంది. రేపోమాపో బోర్డు సీఈఓ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేస్తారు" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

కౌంటీల్లో ఇది రెండో సీజన్
32 ఏళ్ల అశ్విన్‌కిది ఇంగ్లిష్ కౌంటీల్లో ఇది రెండో సీజన్. 2017 సీజన్‌లో వర్సెస్టర్‌షైర్ తరఫున అశ్విన్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు తీయడంతో పాటు 214 పరుగులు చేశాడు. మరోవైపు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే హాంప్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

బోర్డు కూడా కౌంటీ జట్లతో టచ్‌లో
బోర్డు కూడా కౌంటీ జట్లతో టచ్‌లో ఉంది. జూన్, జులై మధ్యలో జరిగే ఈ కౌంటీల్లో భారత్‌కు చెందిన టాప్ ప్లేయర్లకు కౌంటీ కాంట్రాక్టులు లభించేలా చొరవ తీసుకుంటుంది. ఇక, భారత టెస్టు బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకు యార్క్‌షైర్‌తో మూడేళ్ల ఒప్పందం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications