న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విచిత్రంగా బంతిని విసిరాడు: గెలుపు కోసం అశ్విన్ తప్పుడు మార్గం (వీడియో)

Ashwin's Bizarre Bowling Action During Tamil Nadu League || Oneindia Telugu
Ashwins Bizarre Bowling Action During Tamil Nadu League Match Has Stunned Cricket Fans

హైదరాబాద్: ఈ ఏడాది ఐపీఎల్‌లో 'మన్కడింగ్‌'తో వివాదం రేపిన టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)లో విచిత్రంగా బౌలింగ్ చేసి అభిమానులను విస్మయానికి గురిచేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీఎన్‌పీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డుండిగల్‌ డ్రాగన్స్‌తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు తలపడింది. డుండిగల్‌ డ్రాగన్స్‌ విజయానికి 2 బంతుల్లో 17 చేయాల్సిన సమయంలో ఆ జట్టు అశ్విన్‌ విచిత్రంగా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. పుల్ యాక్షన్‌తో కాకుండా బంతిని విసిరాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డ్రాగన్స్‌ జట్టు నిర్ణతీ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్‌ అశ్విన్‌ 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది.

దీంతో డ్రాగన్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. గెలుపు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటావా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ను అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో అశ్విన్ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, పలువురు ఆటగాళ్లు అశ్విన్ ఐసీసీ రూల్ ప్రకారమే నడుచుకున్నాడంటూ మద్దతు పలకడం విశేషం.

Story first published: Saturday, July 20, 2019, 12:57 [IST]
Other articles published on Jul 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X