రెండో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ: అశ్విన్, రోహిత్ దూరం


హైదరాబాద్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమిండియా ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు దూరమయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు గురువారం బీసీసీఐ 13 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు హనుమ విహారి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లకు చోటు కల్పించింది.
గాయాల కారణంగానే రోహిత్ శర్మ, అశ్విన్ రెండో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో పెర్త్‌లో జరగనున్న రెండో టెస్టుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. మొదటి టెస్టుకు ముందు కాలికి గాయం కావడంతో పృధ్వీ షా ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు.
ఇప్పటికీ కోలుకోకపోవడంతో అతడికి రెండో టెస్టులో కూడా చోటు దక్కలేదు. ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టు గెలవడం ఇదే మొదటిసారి.
తొలి టెస్టు విజయంతో ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు రెండో టెస్టుకు ముందు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే, టిమ్ పైన్ నేతృత్వంలోని కంగారూల జట్టు బలహీనంగా ఉంది. రెండో టెస్టులో ఓపెనర్లు సక్సెస్ అయితే, ఆసీస్‌ను వారి గడ్డ మీదే ఓడించి మరో చరిత్ర కూడా సృష్టించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రవిచంద్రన్ అశ్విన్
స్పిన్నర్ అశ్విన్ ఎడమవైపు పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత విజయంలో అశ్విన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

రోహిత్ శర్మ
టెస్టుల్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తోన్న క్రమంలో వెన్నునొప్పి అతడిని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రోహిత్ శర్మ కూడా వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నాడు. వెన్ను నొప్పి నుంచి ఇంకా అతడు కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 37 పరుగులు మాత్రమే చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

పృథ్వీ షా
ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ఆడుతోన్న వార్మప్ మ్యాచ్‌లో గాయం తగలడంతో తొలి టెస్టుకు దూరమైయ్యాడు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని భావించిన అది జరగలేదు. గాయం తగ్గకపోవడంతో రెండో టెస్టుకు కూడా ఈ యువ క్రికెటర్‌కు అవకాశం లభించలేదు. పృథ్వీ క్రమంగా కోలుకుంటున్నాడని.. ప్రస్తుతం నడుస్తున్నాడని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ఈ ముంబై ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పెర్త్ టెస్టుకు టీమిండియా
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications