హైదరాబాద్: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌కి టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి పేరుతో ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్‌కి దూరమైన అశ్విన్.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్నాడు.
ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు భారత పర్యటనకు రానుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్‌లో భాగంగా వార్సెష్టర్‌షైర్ తరపున ఆడుతున్న అశ్విన్.. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌పై అనుమానం వ్యక్తం చేశాడు.

'ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం బీసీసీఐ నుంచి నాకు పిలుపు వస్తుందనే అనుకుంటున్నా. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్నప్పటికీ, జట్టుకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పాను. ఇప్పటికీ బీసీసీఐ నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత నా ఎంపికపై చర్చిస్తారేమో చూడాలి' అని అశ్విన్ అన్నాడు.
'ఇంగ్లాండ్‌లో కౌంటీలు ఆడటం వరల్డ్ కప్ 2019కి ఉపయోగపడుతుంది. ఆ టోర్నీ ఇక్కడే జరుగుతుంది కాబట్టి.. అప్పటికి పిచ్‌లపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. కానీ.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐదే' అని అశ్విన్ వివరించాడు. ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న అశ్విన్ ఈ సిరిస్‌కి అందుబాటులో లేకపోతే అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కే అవకాశం ఉంది.