
హైదరాబాద్: సోమవారం (నవంబర్ 13)తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్, ప్రీతి అశ్విన్‌లకు పెళ్లి అయిన ఆరు సంవత్సరాలు పూర్తయింది. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం తన భార్య ప్రీతికి అశ్విన్ ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశాడు. అందులో ఈ ఆరేళ్లు కష్టసుఖాల్లో తనకు తోడుగా ఉన్న ప్రీతికి అశ్విన్ ధన్యవాదాలు తెలిపాడు.
అయితే, అశ్విన్ పెట్టిన పోస్టుకి ప్రీతి కూడా తనదైన శైలిలో స్పందించింది. 'యువర్ వెల్కమ్. కష్టసుఖాల్లో మనం కలిసి సాగాం. కానీ, మన వివాహం 'కిటో'లోనూ కలిసిసాగేంత దృఢమైనదని నువ్వు భావించావా' అంటూ అశ్విన్ ఉద్దేశించి ట్వీట్ చేసింది.
ఆ తర్వాత ప్రీతి తమ ఫస్ట్ నైట్ సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 'ఆరేళ్ల కిందట ఇదే రోజు మేం కోల్‌కతాకు వెళ్లాం. తెల్లవారే మ్యాచ్ ఉండటంతో అతన్ని పడుకోనివ్వు అంటూ మా కుటుంబసభ్యులు నాకు సూచించారు. కానీ, టీమ్‌కు సంబంధించిన రహస్య అల్లారంలు రాత్రాంతా మోగాయి. ఆ తర్వాత రోజు మేం బాటింగ్ చేశాం' అని ప్రీతి సరదాగా వివరించింది.
ఇదిలా ఉంటే కిటో అంటే ఏమిటో అర్ధంకాక అభిమానులు ప్రీతిని వివరించాల్సిందిగా ట్విట్టర్‌లో కోరారు. 'కిటో అంటే కెటోజెనిక్ డైట్. ఇది తక్కువ కార్బన్ ఉన్న డైట్.. మనిషి ఆహారం తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం కొవ్వును కరిగించి కాలేయంలోకి కీటోన్స్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఆహారం తక్కువగా తీసుకున్న.. సమయంలోనూ మనిషి దృఢంగా ఉండేందుకు పనికొస్తోంది' అని ప్రీతి వివరించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.