Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashwin: గంభీర్‌ని ఆకాశానికెత్తేసిన అశ్విన్.. కోహ్లీని టార్గెట్ చేశాడా..?

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గంభీర్ అద్భుతమైన టీమ్ మేన్ అని, దురదృష్టవశాత్తూ అందరికంటే ఎక్కువగా అపార్థం చేసుకున్న ఆటగాడు కూడా గౌతం గంభీరేనన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అశ్విన్ గంభీర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 'నాకు తెలిసి టీమిండియా క్రికెటర్లందరిలో గంభీరే ఆల్ టైమ్ బెస్ట్ టీమ్ ప్లేయర్. అయితే అందరికంటే అపార్థానికి గురైన ఆటగాడు కూడా గంభీరే. గంభీర్‌ది స్వార్థం లేని స్వభావం. ఎప్పుడూ జట్టు కోసమే పోరాడేవాడు.

ఇదిలా ఉంటే గంభీర్ క్రికెట్ కెరీర్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అశ్విన్ కామెంట్స్ నిజమే అనిపిస్తుంది. 12 ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో భారత క్రికెట్‌పై గంభీర్ తనదైన ముద్ర వేశాడు. కెరీర్‌లో మొత్తం 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన గంభీర్ 4,154 రన్స్ చేశాడు. అలాగే 147 వన్‌డే మ్యాచ్‌ల్లో 5,238 రన్స్, 37 టీ20 మ్యాచ్‌ల్లో 932 రన్స్ చేశాడు. అయితే గంభీర్‌ కెరీర్లో కేవలం వ్యక్తిగత రికార్డులే కాదు ఎన్నో మ్యాచ్‌లలో టీమిండియాని ముందుండి నడిపించి విజయాలనందించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్‌ టోర్నీలో కూడా గంభీర్ తనదైన ముద్ర వేశాడు. గంభీర్ కెప్టెన్సీలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014 టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. అందుకే ఐపీఎల్‌లో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అండ్ ప్లేయర్స్ లిస్ట్‌లో గంభీర్‌కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

Ashwin praises Gambhir just before world Cup

అలాంటి మ్యాచ్‌లలో 2011 ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఆయా టోర్నీల్లో టీమిండియా గెలుపులో గౌతం గంభీర్‌‌‌‌ కీ రోల్ పోషించాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్‌లో గంభీర్ 75 రన్స్ బాది టీమిండియాకి ఫైటింగ్‌ టోటల్ అందించాడు. అలాగే 2011 ప్రపంచకప్‌లో కూడా సచిన్, సెహ్వాగ్‌లాంటి భీరకమైన బ్యాట్స్‌మెన్ వచ్చీ రావడంతోనే పెవిలియన్ చేరినా.. గంభీర్ మాత్రం నిలకడగా ఆడుతూ 97 రన్స్‌తో మెమరబుల్ ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ ఈ రెండు టోర్నీల్లోనూ గంభీర్‌కి తగినంత గుర్తింపు లభించలేదని అతడి ఫ్యాన్స్ ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

ఇక అశ్విన్ డైరెక్ట్‌గా గంభీర్‌ ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికెత్తేయడంతో అతడు కోహ్లీని టార్గెట్ చేశాడంటూ విరాట్ ఫ్యాన్స్ అంటున్నారు. కోహ్లీకి, గంభీర్‌కి పడదని తెలిసి కూడా అశ్విన్ ఇలా గంభీర్‌ని ప్రశంసించడం కచ్చితంగా కోహ్లీని టార్గెట్ చేయడమేనని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Thursday, October 5, 2023, 13:32 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+