టెస్టు ఫార్మాట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ది అగ్రస్థానం. ఇక ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. అయినా భారత టెస్టు జట్టులో అశ్విన్ స్థానం సుస్థిరమని చెప్పలేం. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల్లో అశ్విన్ ఉండటం దాదాపు ఖాయమే, కానీ విదేశాల్లో ఆడే మ్యాచ్‌ల్లో యాష్ ఉంటాడని చెప్పలేని పరిస్థితి.
అశ్విన్, జడేజాలలో ఒక్కరినే ఎంచుకునే పరిస్థితుల్లో.. అశ్విన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతేగాక అంతకముందు పరిమిత ఓవర్ల ఫార్మాట్ జట్టులోనూ అశ్విన్ ఉండేవాడు. కానీ క్రమంగా స్థానం కోల్పోయాడు. అయితే తనకు బదులుగా జడేజాను ఎంపిక చేయడం గురించి ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడాడు. భారత జట్టులో తన స్థానం కోల్పోవడానికి జడేజా కారణం కాదని అన్నాడు.

'' 'అసూయ గురించి మాట్లాడుతున్నారా?. జడేజాపై నాకు ఎలాంటి అసూయ లేదు. నేను ఆడకపోవడానికి జడేజా కారణం కాదు. నేను ఆడటం కోసం జడేజాను దూరంగా పెట్టాలనే అసూయ నాకు లేదు. అసూయ అనేది మనం అధిగమించాల్సిన అంశం. ఇక నేను చూసిన ఆటగాళ్లలో జడేజా ఎంతో టాలెంటెడ్ క్రికెటర్. గత కొన్నాళ్లు మా మధ్య బంధం మరింత మెరుగవుతుంది'' అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, 37 ఏళ్ల అశ్విన్ 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు.
టెస్టుల్లో 516 వికెట్లు, వన్డేల్లో 156, పొట్టి ఫార్మాట్‌లో 72 వికెట్లు పడగొట్టాడు. అంతేగాక అన్ని ఫార్మాట్లలో కలిపి 4200 పరుగులు చేశాడు. అయితే అశ్విన్ ప్రస్తుతం టెస్టు జట్టులోనే కొనసాగుతున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో, 2022 టీ20 ప్రపంచకప్‌లో చివరిసారిగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆడాడు. మరోవైపు 35 ఏళ్ల జడేజా 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు.

టెస్టుల్లో జడేజా 3036 పరుగులు, 294 వికెట్లు, వన్డేల్లో 2756 పరుగులు, 220 వికెట్లు, టీ20ల్లో 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. కాగా, ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం జడేజా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.