Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ర్యాంకింగ్స్: కోహ్లీ అగ్రస్థానం పదిలం, 7వ ర్యాంకులో అశ్విన్

Ashwin moves up to seventh spot in ICC rankings

హైదరాబాద్: ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు.

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి సఫారీ పేస్ బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

జానీ బెయిర్‌స్టో(ఇంగ్లాండ్), మొమినుల్ హాక్(బంగ్లాదేశ్), యాసిర్ షా(పాకిస్థాన్)లు తన ర్యాంకులను మరింతగా మెరుగుపరచుకున్నారు. దుబాయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన పాక్ స్పిన్నర్ యాసిర్ షా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

న్యూజిలాండ్‌తో టెస్టులో అద్భుత ప్రదర్శన చేసి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో యాసిర్ షా 8/41, రెండో ఇన్నింగ్స్‌లో 6/143 లాంటి సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది.

ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. తొలి టీ20లో ఆసీస్ గెలవగా, మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది.

Story first published: Wednesday, November 28, 2018, 18:36 [IST]
Other articles published on Nov 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+