బట్లర్‌ని ‘మన్కడింగ్’ చేసిన అశ్విన్: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న కోర్ట్నీ వాల్ష్ (వీడియో)

హైదరాబాద్: 'మన్కడింగ్ ఔట్' అనే పదం సోమవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్ ' ఔట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
జోస్ బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌లో అశ్విన్ తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి.
‘మన్కడింగ్' ద్వారా ఎవరైనా ఔటయ్యారా?
అయితే, గతంలో కూడా ఎప్పుడైనా ‘మన్కడింగ్' ద్వారా ఎవరైనా ఔటయ్యారా? అనే అంశం తెరపైకి వచ్చింది. దీంతో 1987 వన్డే వరల్డ్ కప్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. లాహోర్ వేదికగా వెస్టిండీస్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో ఒక్క వికెట్ కావాలి.
పాక్ గెలవాలంటే మాత్రం 14 అవసరం
అదే పాక్ గెలవాలంటే మాత్రం 14 అవసరం. ఆఖరి ఓవర్ వేసేందుకు విండిస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ వచ్చాడు. క్రీజులో పాక్ ఆటగాళ్లు అబ్దుల్ ఖాదిర్, సలీం జాఫర్ క్రీజులో ఉన్నారు. మొదటి రెండు బంతులకు చెరో పరుగు చేయడంతో పాకిస్థాన్ విజయానికి ఆఖరి నాలుగు బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి.
మూడో బంతికి రెండు పరుగులు
అబ్దుల్ ఖాదిర్ మూడో బంతికి రెండు పరుగులు తీసి నాలుగో బంతిని సిక్స్‌గా మలిచాడు. అనంతరం ఐదో బంతికి మరో రెండు పరుగులు చేయగా చివరి బంతికి ఇక రెండు పరుగులు కావాల్సి ఉంది. వికెట్ తీస్తే విండీస్ విజయం సాధిస్తుంది. ఆ సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సలీం జాఫర్.. కౌర్ట్నీ బంతి విసరకముందే క్రీజు వదిలి వెలుపలికి వెళ్లాడు.
బౌలింగ్ చేయడం ఆపి సలీం జాఫర్‌ను హెచ్చరించిన కౌర్ట్నీ వాల్ష్
దీంతో కౌర్ట్నీ బౌలింగ్ చేయడం ఆపి సలీం జాఫర్‌ను హెచ్చరించాడు. చివరి బంతికి రెండు పరుగులు చేసిన పాక్ ఆ మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్‌కు వెళ్లింది. సలీంను ఔట్ చేసే అవకాశం వచ్చినా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన కోర్ట్నీ వాల్స్‌పై ప్రశంసలు కురిపంచారు. అంతేకాదు అప్పటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హాక్ ‘క్విక్ కార్పెట్'ను కౌర్ట్‌నీకి బహుమతిగా ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications