INDvsAUS : చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే రికార్డు బద్దలు!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన అశ్విన్.. మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత వేగంగా 450 టెస్టు వికెట్లు తీసుకున్న టీమిండియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా ఈ జాబితాలో అతను రెండో స్థానంలో నిలిచాడు.

ఆసీస్ కష్టాలు..
నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఖవాజా (1), వార్నర్ (1) ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత స్మిత్ (37), లబుషేన్ (49) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. లంచ్ వరకూ వాళ్ల ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. లంచ్ బ్రేక్ తర్వాత జడ్డూ ఈ భాగస్వామ్యాన్ని దెబ్బతీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ (36) చక్కగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో కుదురుకొని ప్రమాదకరంగా మారుతున్నట్లు కనిపించాడు. స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లతో భారత స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగాడు. అయితే చివరకు అశ్విన్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు.

సింపుల్ ప్లాన్‌తో..
అతన్ని అవుట్ చేయడానికి అశ్విన్ సింపుల్ ప్లాన్ వేశాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తూ క్యారీని ఒత్తిడిలోకి నెట్టాడు. అశ్విన్ వేసిన బంతిని స్వీప్ చేయడానికి క్యారీ ప్రయత్నించాడు. ఈ సమయంలో బ్యాటు కింది భాగంలో ఎడ్జ్ తీసుకున్న బంతి ఒక స్టెప్ పడి వికెట్లను కూల్చింది. దీంతో అశ్విన్ తన 450వ టెస్టు వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి అశ్విన్ 89 టెస్టులు ఆడాడు. అత్యంత వేగంగా 450 వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అశ్విన్ కన్నా ముందు.. కేవలం ముత్తయ్య మురళీధరన్ (80 టెస్టులు) మాత్రమే ఉన్నాడు.

భారత్ తరఫున నెంబర్ వన్..
ఆ తర్వాత కూడా జోరు తగ్గించని అశ్విన్.. మరో రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 450 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే ఈ ఫీట్‌ను 93 టెస్టుల్లో సాధించాడు. ఇప్పుడు అశ్విన్ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అశ్విన్‌తోపాటు రవీంద్ర జడేజా కూడా విజృంభించడంతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా వణికిపోయింది. జడ్డూ ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆ జట్టు 177 పరుగులకు ఆలౌట్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications