పెర్త్: విదేశీ గడ్డపై స్పిన్నర్లు రాణంచలేరనే అపవాదును టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలగించారని టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో పాకిస్ధాన్, దక్షిణాఫ్రికాపై వరుస విజయాలు సాధించడంలో అశ్విన్, జడేజాలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వీరిద్దరే కీలక బౌలర్లుగా అభివర్ణించారు. బెస్ట బౌలర్‌గా జడేజా ఎంపికైన విషయాన్ని కోహ్లీ గుర్తు చేశారు. స్పిన్నర్లు ముఖ్యమైన బౌలర్లు అవుతారని ఏ ఒక్కరూ ఊహించి ఉండరని అన్నారు. ఆస్టేలియాలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టోర్నమెంట్లో స్పిన్నర్లపై ఉండే అభిప్రాయం తప్పని నిరూపించారు. ఫిబ్రవరి 22 ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా వీరిద్దరూ అత్యత్తుమ ప్రదర్శనను ప్రదర్శించారని తెలిపారు.
పాకిస్ధాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుతు మా దృష్టంగా వికెట్ల తీయడంపైనే పెట్టామని అన్నారు. పాక్‌పై అశ్విన్ దాన్నే దృష్టిలో పెట్టుకుని వికెట్లను తీయడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజా ఎటాకింగ్ బౌలింగ్ వేశాడని చెప్పుకొచ్చారు.

ఆస్టేలియాలోని మైదనాలు చాలా పెద్దవి. బౌండరీలు దూరంగా ఉంటాయి. తెలివిగా బౌలింగ్ వేస్తే రివార్డు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. టీమిండియా బౌలింగ్ విభాగంలో గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్న వీరిద్దరూ టెస్టుల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శనిచ్చారని పేర్కొన్నారు.
భారత్‌కు వారిద్దరి బౌలింగ్ భాగస్వామ్యం ఎంతో కీలకం. ఒకో ఇన్నింగ్స్‌లో 3 నుంచి 4 వికెట్లు తీసుకుని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇక బ్యాట్స్‌మెన్‌కు కెప్టెన్ ధోని సేవలు ఉండనే ఉన్నాయని, సరైన ప్రణాళికలు సరైన సమయంలో రచించడంలో ధోని ముందుంటాడని కోహ్లీ తన అభిప్రాయాన్ని తెలిపారు.
పాకిస్ధాన్‌పై ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. పిబ్రవరి 22 ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ 3, జడేజా 1 వికెట్ తీసుకుని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.