టీమిండియాలో అశ్విన్ అనర్హుడు.. కెప్టెన్సీలో వారిద్దరు హార్దిక్‌కు పోటీ - యువరాజ్
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే, టీ20ల భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కకూడదని, అతడు అనర్హుడని యువీ అన్నాడు. గత టీ20 ప్రపంచప్‌తో పాటు ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో అశ్విన్ టీమిండియాలో చోటు సంపాదించిన విషయం తెలిసిందే. టీ20 కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అశ్విన్ విన్నింగ్ షాట్ ఆడి జట్టును గెలిపించాడు.
వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే తుదిజట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అయితే అక్షర్ పటేల్‌కు గాయమవ్వడం అశ్విన్‌కు కలిసొచ్చింది. ''అశ్విన్ గొప్ప బౌలర్. కానీ వన్డే, టీ20 ఫార్మాట్‌లో అతడు జట్టులో అనర్హుడిగా భావిస్తున్నా. బంతితో అతడు మెరుగ్గా రాణించగలడు. కానీ బ్యాటుతో, ఫీల్డర్‌గా ఎంతమేర ప్రభావం చూపగలడు? అయితే అతడు టెస్టు జట్టులో ఉండాలి'' అని యువరాజ్ సింగ్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ప్రపంచ నంబర్ వన్ టెస్టు బౌలర్ అశ్విన్ కూడా ఎంపికైన విషయం తెలిసిందే.

ముంబయి కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ బదులుగా హార్దిక్ అందుకున్న సంగతి తెలిసిందే. దీనిపై యువీ స్పందిస్తూ.. ''ఫ్రాంచైజీ క్రికెట్‌లో వయసు పెరిగేకొద్ది మీరు క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రాంచైజీ కూడా భారీగా ఖర్చు పెట్టిన యువ ప్లేయర్ గురించి ఆలోచిస్తారు. అదే న్యాయం కూడా. నేను కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాను. అయితే అనుభవాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. రోహిత్‌కు ఎంతో అనుభవం ఉంది. గొప్పగా సత్తాచాటాడు. ఫ్రాంచైజీ ముందుచూపుతో ఆలోచించాలి'' అని అన్నాడు.
''హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. భారత్‌కు అతడు కావాలి. గాయపడిన హార్దిక్ పూర్తిగా కోలుకునే వరకు సమయాన్ని ఇవ్వాలి. అతడు కుదురుకోవాలి. అప్పుడు అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించాలి. అయితే కెప్టెన్సీ విషయానికొస్తే మనకు మరిన్ని ఆప్షన్లు ఉండాలి. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఆప్షన్లుగా భావిస్తున్నా. టీ20ల్లో టీమిండియాకు సూర్య కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. మరోవైపు గిల్ ఐపీఎల్ సారథి బాధ్యతలు అందుకోన్నాడు'' అని యువరాజ్ సింగ్ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications