క్రికెట్ చూడటం మానేశా!: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నవ్వులు పూయించిన అశ్విన్

హైదరాబాద్: క్రికెట్‌కు దూరంగా ఉండటం తనకు చాలా కఠినంగా ఉంటుందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. గురువారం రెండు, శుక్రవారం మూడు, శనివారం రెండు వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ కెరీర్‌లో మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఇలా ఏడు వికెట్లను తీయడం అశ్విన్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో అశ్విన్, జడేజాలతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించాడు.
అయితే, మూడో రోజు ఆట పూర్తయ్యాక అశ్విన్ మీడియా సమావేశంలో పాల్గొని రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. గత కొంతకాలంగా క్రికెట్ చూడటం ఎందుకు మానేశారని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అశ్విన్ చెప్పిన సమాధానంతో అక్కడ నవ్వులు పూశాయి.

క్రికెట్‌కు దూరంగా
"క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కఠినమైనది. గతంలో నేను చేసినట్లుగా ఆట గురించి చదవడం మానేశాను. నిజానికి క్రికెట్‌కు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలంటే... ఆటను చూడాలి. టీవీలో మ్యాచ్‌లు చూసినప్పుడల్లా నాకు ఆడాలనిపించేది. కానీ నేను ఆడలేకపోయా. ఒక దశలో నేను క్రికెట్ చూడటం మానేశాను" అని అని అశ్విన్ తెలిపాడు.

నాకు ఇద్దరు పిల్లలు
"ఇది సాధారణ విషయమే. నాకు ఇద్దరు పిల్లలు, రాత్రుల సమయాల్లో వాళ్లు అస్సలు నిద్రపోరు. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అదే సమయంలో నేను ఇతర విషయాలపై మనసు మళ్లించాను. పుస్తకాలు చదవడం, ఆర్కియాలజీకి సంబంధించిన పనులు చేయడంలాంటివి చేశా. అలా నా సమయాన్ని గడిపి అస్వాదించాను" అని అశ్విన్ అన్నాడు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ... రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ కేవలం 72 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు
ఫలితంగా ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. సొంతగడ్డపై గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో 82, 51*, 102*, 65, 50*, 176, 50* ఏడుసార్లు యాభైకి పైగా స్కోరు సాధించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 11వ హాఫ్‌సెంచరీ. భారత్ తరఫున మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications