For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : ఆ ఓటమి తర్వాత కోహ్లీతో మాట్లాడా.. నెక్స్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు!

Ashwin had a personal talk with Virat Kohli just before his big century

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మళ్లీ తన పీక్ ఫామ్ అందుకుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన పూర్వపు ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్న కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం అంతగొప్పగా రాణించలేకపోయాడు. మూడేళ్లకుపైగా అంతర్జాతీయ శతకం లేకుండానే ఉన్న ఈ రన్ మెషీన్.. అఫ్ఘానిస్తాన్‌పై టీ20 శతకంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే శతకం చేసి వన్డేల్లో కూడా తను ఫామ్ అందుకున్నానని చాటి చెప్పాడు.

పర్సనల్‌గా మాట్లాడా..

పర్సనల్‌గా మాట్లాడా..

అయితే ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల సిరీసులో విఫలమయ్యాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో చెలరేగాడు. కానీ కివీస్‌పై వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మూడు మ్యాచుల్లో బాగానే బ్యాటింగ్ చేసిన అతను భారీ స్కోరు మాత్రం చేయలేకపోయాడు.

ఈ క్రమంలోనే ఇండోర్ టెస్టులో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత తను కోహ్లీతో పర్సనల్‌గా మాట్లాడానని స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే కోహ్లీ భారీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

కోహ్లీకి అలా చెప్పడం చాలా అవసరం..

కోహ్లీకి అలా చెప్పడం చాలా అవసరం..

'ఇండోర్ టెస్టు తర్వాత పర్సనల్‌గా విరాట్‌తో మాట్లాడా. మామూలుగా ఇలాంటి విషయాల గురించి మేం పెద్దగా చర్చించుకోం. కానీ విరాట్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని నాకు చాలా గట్టిగా అనిపించింది' అని చెప్పుకొచ్చాడు. ఇండోర్ టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 22, 13 పరుగులు మాత్రమే చేశాడు.

కోహ్లీ క్రీజులో చక్కగా కుదురుకుంటున్నాడని, కానీ 30 లేదా 40 పరుగులు చేసి అవుటవుతున్నాడని అశ్విన్ చెప్పాడు. 'అలాంటి సమయంలో జస్ట్ అతని భుజాల చుట్టూ చెయ్యి వేసి నువ్వు అద్భుతంగా ఆడుతున్నావ్. జస్ట్ అలా ఆడుతూ ఉంటే చాలు పరిస్థితులు వాటంతట అవే మారతాయి అని చెప్పడం ముఖ్యం' అని వెల్లడించాడు.

 నా కెరీర్‌లో కూడా..

నా కెరీర్‌లో కూడా..

ఈ పద్ధతి తన క్రికెట్ కెరీర్‌లో కూడా చాలా ఉపయోగపడిందని, కోహ్లీ కూడా తొందరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడతాడని తనకు చాలా గట్టిగా అనిపించిందని అశ్విన్ చెప్పాడు. అంతకుముందు లంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ రాణించిన విషయాన్ని గుర్తుచేశాడు.

కోహ్లీ, పుజారా ఫామ్ అందుకుంటే అది జట్టుకు చాలా పెద్ద ప్లస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. వీళ్లిద్దరూ ఆడితే భారత్‌కు అదొక పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుందన్నాడు. కోహ్లీ, పుజారా బ్యాటింగ్ చేస్తుంటే అలా కూర్చొని రోజంతా చూస్తూ ఉండటానికి ఏం చెయ్యాలన్నా తను చేస్తానని పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 16, 2023, 22:29 [IST]
Other articles published on Mar 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+