Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : కోచ్ ద్రావిడ్‌ టీం ఎందుకు రెస్ట్ తీసుకుంది?.. వివరించిన వెటరన్ స్పిన్నర్

 Ashwin explains why Rahul Dravid and team took rest from INDvsNZ series

టీ20 ప్రపంచకప్ ముగిసిన కొన్ని రోజులకే న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడకు వెళ్లింది. ఈ జట్టులో టీమిండియా వెటరన్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు.

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాలో నలురుగురైదుగురు తప్ప మిగతా అందరూ న్యూజిల్యాండ్ వెళ్లారు. అదే సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సహా కోచింగ్ టీమ్ కూడా సీనియర్ ప్లేయర్లతోపాటు రెస్ట్ తీసుకుంది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఎన్సీయే చీఫ్ వీవీఎస్ లక్ష్మణ జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అతనితోపాటు ఎన్సీయే కోచింగ్ స్టాఫ్ హృషికేష్ కనిట్కర్, సాయిరాజ్ బహుతూలే జట్టుతో కలిశారు.

ఇలా ఆటగాళ్లతోపాటు రాహుల్ ద్రావిడ్ కూడా విశ్రాంతి తీసుకోవడాన్ని మాజీ కోచ్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. ఐపీఎల్ సమయంలో దొరికే రెండు నెలల రెస్టు కోచ్‌లకు సరిపోతుందని, మళ్లీ ఇలా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో తనకు తెలియడం లేదని అన్నాడు. 'నేను కోచ్‌గా ఉంటే ఆటగాళ్లతోనే ఎక్కువ టైం గడపడానికి ప్రయత్నిస్తాను. దీని వల్ల ఆటగాళ్లు ఎలా పరిణితి చెందుతున్నారో నాకు తెలుస్తుంది' అన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. యూట్యూబ్ ఛానెల్‌లో రాహుల్ ద్రావిడ్ బృందం ఎందుకు విశ్రాంతి తీసుకుందో చెప్పాడు. 'టీ20 ప్రపంచకప్ కోసం ద్రావిడ్ టీం చాలా కష్టపడింది. ప్రతి వెన్యూలో ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని చాలా ఇన్‌డెప్త్ విశ్లేషణలు చేశారు. దీనివల్ల వాళ్లు కేవలం మానసికంగానే కాదు, శారీరకంగా కూడా అలసిపోయి ఉంటారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను' అని వివరించాడు.

Story first published: Saturday, November 19, 2022, 14:58 [IST]
Other articles published on Nov 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+