
రాణించిన ఖవాజా, గ్రీన్
ఉస్మాన్ ఖవాజా (180) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక దశలో అతను డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. అతనికి జతగా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (114) టెస్టుల్లో తన తొలి శతకం సాధించాడు. అది కూడా భారత్‌లో చేయడం ఈ శతకాన్ని మరింత స్పెషల్ చేస్తుందని మాజీలు కూడా కొనియాడారు. వీళ్లిద్దరూ కలిసి ఆస్ట్రేలియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అతను వేసిన 131వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోయిన గ్రీన్ అవుటయ్యాడు.

వరుసగా వికెట్లు..
అదే ఓవర్లో క్యారీ (0) కూడా పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడే యత్నంలో క్యారీ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్క్ (6)ను కూడా అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఖవాజా కూడా ఎల్బీగా వెనుతిరిగాడు. అయితే అనంతరం జోడీ కట్టిన నాథన్ లియాన్ (34), టాడ్ మర్ఫీ (41) ఇద్దరూ మరో వికెట్ పడనివ్వలేదు. అలాగే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్ల జోరు చూస్తుంటే ఆసీస్ స్కోరు 500 పరుగులు దాటేలా కనిపించింది. ఇలాంటి సమయంలో భారత జట్టు మరో కొత్త బంతిని తీసుకుంది.

కొత్త బంతితో మాయ..
కొత్త బంతితో రాణించడంలో పేసర్ షమీ విఫలమైనా.. అశ్విన్ మళ్లీ తన టాలెంట్ చూపించాడు. మర్ఫీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అతను రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కునేమన్ (0 నాటౌట్)తో కలిసి కొంచెం గట్టిగా ఆడేందుకు లియాన్ ప్రయత్నించాడు. ఇదంతా చూసిన అభిమానులకు.. ఆస్ట్రేలియా ఎలాగైనా ఈ రోజు మొత్తం ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమైంది. అయితే మరో పది ఓవర్ల ఆట ఉందనగా అశ్విన్ వేసిన బంతిని లియాన్ డిఫెండ్ చేసుకోబోయాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి.. కీపర్ భరత్ కాలికి తగిలి గాల్లోకి లేచింది. దాన్ని స్లిప్స్‌లో ఉన్న కోహ్లీ సులభంగా పట్టేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 480 పరుగుల వద్ద ముగిసింది. అశ్విన్ ఏడు వికెట్లతో చెలరేగాడు.


Click it and Unblock the Notifications











