Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: చివర్లో ఆదుకున్న అశ్విన్, కుల్దీప్.. భారీ స్కోరు చేసిన టీమిండియా

 Ashwin and Kuldeep Yadav help Team India in INDvsBAN test

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టును రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ఆదుకున్నారు. రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ (86) పెవిలియన్ చేరడంతో భారత్ భారీ స్కోరు చేయడం అసాధ్యంగా కనిపించింది. అయితే అశ్విన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కుల్దీప్ కూడా 40 పరుగులతో రాణించాడు.

శ్రేయాస్ అవుటైన తర్వాత..

రెండో రోజు 82 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట మొదలు పెట్టిన శ్రేయాస్ అయ్యర్ (86) నాలుగు పరుగులు చేసిన తర్వాత అవుటైపోయాడు. అప్పటికి భారత్ స్కోరు కేవలం 293 మాత్రమే. దీంతో 350 పరుగులు చేయడం కూడా భారత్‌కు అసాధ్యంగా కనిపించింది. అలాంటి సమయంలో వ్యూహాత్మకంగా ఉమేష్ యాదవ్ కన్నా ముందు కుల్దీప్‌ యాదవ్‌ (40)ను జట్టు యాజమాన్యం క్రీజులోకి పంపింది. అతను అశ్విన్‌కు చక్కని సహకారం అందించాడు. అతని ఆటతీరు చూసిన అభిమానులు కూడా కుల్దీప్ ఇంత బాగా ఆడతాడా? అని ఆశ్చర్యపోయారు.

ఆకట్టుకున్న అశ్విన్..

ఇటీవలి కాలంలో టెస్టుల్లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు అమూల్యమైన పరుగులు చేస్తున్న అశ్విన్.. ఈ మ్యాచ్‌లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తనలోని బ్యాటర్‌ను బయటకు తీశాడు. కుల్దీప్ యాదవ్ అండగా నిదానంగా ఇన్నింగ్స్ నిర్మించిన అశ్విన్.. 9వ వికెట్‌కు 80 పరుగులపైగా భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ దాన్ని మరింత భారీ స్కోరుగా మలచలేకపోయాడు. వ్యక్తిగత స్కోరు 58 పరుగుల వద్ద మెహదీ హసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

బంగ్లా ముందు భారీ టార్గెట్..

అశ్విన్, కుల్దీప్ ఇద్దరూ రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత ఉమేష్ యాదవ్ (14 నాటౌట్) రెండు సిక్సర్లు బాదాడు. మరో ఎండ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్ (4) కూడా ఒక బౌండరీ బాదాడు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ముష్ఫికర్ రహీంకు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత జట్టు 404 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు భారీ లక్ష్యం నిలిచింది. పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు ఉపయోగించుకుంటే బంగ్లాను త్వరగానే ఆలౌట్ చేసే అవకాశం ఉంది.

Story first published: Thursday, December 15, 2022, 14:26 [IST]
Other articles published on Dec 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+