తమ్ముడి షాట్.. అన్నకు తీవ్ర గాయం.. తప్పిన పెను ప్రమాదం!!

అడిలైడ్: మార్ష్ వన్డే కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్‌కు తీవ్ర గాయమైంది. సోదరుడు వెస్ అగర్ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో ఆష్టన్ తీవ్రంగా గాయపడ్డాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా- సౌత్ ఆస్ట్రేలియా మధ్య కారెన్ రోల్టన్ ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ముక్కుకు గాయం:
వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఆస్టన్ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. వెస్ సౌత్ ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడుతున్నాడు. వెస్ బ్యాటింగ్ చేస్తున్న క‍్రమంలో 41 ఓవర్‌ను మార్కస్ స్టోయినిస్ వేశాడు. ఆ ఓవర్‌లోని ఓ బంతిని వెస్ మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆస్టన్ బంతిని అందుకోవడానికి యత్నించాడు. క్యాచ్‌ను అందుకోవడానికి ప్రయత్నించిన ఆస్టన్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో బంతి నేరుగా వచ్చి అతడి ముక్కుకి బలంగా తగలడంతో రక్తస్రావమైంది.

త్వరలో పెళ్లి:
గాయం అవ్వడంతో ఆటగాళ్లంతా ఆస్టన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వైద్యులు అతడిని మైదానం అవతలికి తీసుకెళ్లి చికిత్స అందించారు. గాయమైన చోట కుట్లు వేయాలని డాక్టర్లు సూచించగా.. అందుకు ఆస్టన్ నిరాకరించాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కారణంగానే కుట్లుకు ఆస్టన్ నిరాకరించాడు. ప్లాస్టిక్ సర్జన్ చేయించుకుంటాడని తెలిసింది. ఈ టోర్నీకి ఆస్టన్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

ఆస్టన్ బాగానే ఉన్నాడు:
ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెస్ అగర్ తెలిపాడు. 'అదుపుతప్పి ఆస్టన్ కిందపడ్డాడు. బంతి నేరుగా వచ్చి కళ్లద్దాలకు తగిలింది. అవి పగలడంతో అతడికి తీవ్ర గాయమైంది. ఆ సమయంలో నేను క్రీజులో నుంచి నేరుగా ఆస్టన్ వద్దకు పరిగెత్తా. అతడి గాయంపై చింతిస్తున్నా. దేవుడి దయతో ప్రస్తుతం ఆస్టన్ బాగానే ఉన్నాడు' అని వెస్ అగర్ తెలిపాడు.

ఆసీస్ తరఫున 4 టెస్టులు:
ఆసీస్ తరఫున ఆస్టన్ అగర్ ఇప్పటివరకు 4 టెస్టులు, 9 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. టెస్టుల్లో తొమ్మిది వికెట్లతో పాటు 195 పరుగులు చేసాడు. వన్డేల్లో 8 వికెట్లు, 144 పరుగులు బాదాడు. పొట్టి ఫార్మాట్‌లో 17 వికెట్లు, 82 పరుగులు చేశాడు. 22 ఏళ్ల వెస్ అగర్ మాత్రం ఇంకా ఆసీస్ జట్టులో చోటు సంపాదించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications