Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ క్రికెట్‌లో జడేజానే నా ఫేవరెట్‌ ప్లేయర్‌: ఆసీస్ స్టార్ క్రికెటర్

Ashton Agar says Ravindra Jadeja is my favourite player in the world

జోహెనెస్‌బర్గ్‌: శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్‌తో సహా మొత్తం 5 వికెట్లు తీసిన స్పిన్న‌ర్ ఆస్ట‌న్ అగ‌ర్‌ (5/24) జ‌ట్టు విజయంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ నాలుగో బంతికి డుప్లెసిస్‌ను ఔట్‌ చేసిన అగ‌ర్‌ .. ఆ తర్వాత ఫెహ్లుక్వోయో, స్టెయిన్‌లను పెవిలియన్ చేర్చి కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను సాధించాడు.

నా ఫేవరెట్‌ జడేజా:

నా ఫేవరెట్‌ జడేజా:

మ్యాచ్ అనంతరం ఆస్ట‌న్ అగ‌ర్‌ మాట్లాడుతూ... 'ప్రపంచ క్రికెట్‌లో నా ఫేవరెట్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా. ఫీల్డ్‌లో జడేజా చేసిన ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాకు కూడా జడేజాలా రాణించాలనుంది. జడేజా ఒక రాక్‌స్టార్‌. ఫీల్డింగ్‌లో చురుకుదనం, బంతిని స్పిన్‌ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా ఆడుతాడు. నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి భారత పర్యటనతో పాటు జడేజా కూడా కారణం' అని పేర్కొన్నాడు.

మూడు వన్డేల్లో రెండు వికెట్లు:

మూడు వన్డేల్లో రెండు వికెట్లు:

ఇటీవల భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడైన ఆగర్‌ మూడు వన్డేల్లో కలిపి రెండు వికెట్లను మాత్రమే తీసాడు. అయితే భారత టూర్‌కు తనను నామమాత్రంగా ఎంపిక చేయగా.. అది తనలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందని ఆగర్‌ తెలిపాడు. తొలి టీ20లో అగ‌ర్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా 14.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌట్ అయింది.

రెండో ఆసీస్‌ ప్లేయ‌ర్‌గా రికార్డు:

రెండో ఆసీస్‌ ప్లేయ‌ర్‌గా రికార్డు:

టీ20 ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండ‌వ ఆసీస్‌ ప్లేయ‌ర్‌గా ఆస్ట‌న్ అగర్ నిలిచాడు. ఇక ఆసీస్‌ తరఫున టీ20ల్లో అత్యధిక బౌలింగ్‌ గణాంకాలు కూడా నమోదు చేశాడు. గతంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ ఐదు వికెట్లు సాధించగా.. ఇప్పుడు అతని సరసన అగర్ చేరాడు. 2016లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20లో ఫాల్కనర్‌ ఐదు వికెట్లు సాధించాడు. ఇప్పటివరకూ ఆసీస్‌ తరఫున టీ20ల్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ కాగా.. నాలుగేళ్ల తర్వాత అగర్‌ ఆ మార్కును అందుకున్నాడు.

9 బంతుల్లో 20 పరుగులు:

9 బంతుల్లో 20 పరుగులు:

ఆస్ట‌న్ అగర్ ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా మెరుపులు మెరిపించాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సుతో 20 పరుగులు కూడా చేసాడు. 26 ఏళ్ల అగర్ ఆసీస్ తరఫున 4 టెస్టులు (410 పరుగులు), 12 వన్డేలు (571 పరుగులు), 22 టీ20 (448 పరుగులు)లు ఆడాడు.

Story first published: Saturday, February 22, 2020, 15:39 [IST]
Other articles published on Feb 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+