Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెటర్ టు ఎమ్మెల్యే: ఆ స్టార్ వెనుక ఉన్న ఆ ‘లేడీ లక్’ ఎవరు?

క్రికెట్ స్టేడియంలో తన వేగవంతమైన బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించిన టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా.. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అశోక్ దిండా ఘన విజయం సాధించాడు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మోయనా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ విజయంతో బెంగాల్ రాజకీయాల్లో దిండా తన పట్టును మరోసారి చాటుకున్నారు.

మే 4న వెలువడిన ఫలితాల ప్రకారం.. అశోక్ దిండా తన సమీప ప్రత్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ మండల్‌పై 16,241 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అశోక్ దిండాకు మొత్తం 1,27,166 ఓట్లు రాగా.. చందన్ మండల్ 1,10,925 ఓట్లకే పరిమితమయ్యారు. 2021 ఎన్నికల్లో కేవలం 1,260 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన దిండా.. ఈసారి తన మెజారిటీని గణనీయంగా పెంచుకోవడం విశేషం. బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో దిండా వంటి యువ నాయకుల కృషి ఎంతో ఉంది.

Ashok Dinda Wins Moyna 2026 The Love Story and Political Rise of India Former Pacer

అశోక్ దిండా సాధించిన ఈ ఘనవిజయంతో ఆయనకు కొత్త ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఆయనకు ఉన్న అనుభవం, క్రీడల పట్ల ఉన్న అవగాహన దృష్ట్యా ఆయన ఈ పదవికి సరైన అభ్యర్థి అని పార్టీ భావిస్తోంది. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వంలో క్రికెటర్ మనోజ్ తివారీ క్రీడా మంత్రిగా పనిచేసినట్లుగానే.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో దిండా ఆ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

అశోక్ దిండా వెనుక లేడీ లక్?
భారత మాజీ పేసర్ అశోక్ దిండా మైదానంలో వికెట్లు తీయడంలో ఎంత వేగంగా ఉండేవారో.. తన వ్యక్తిగత జీవితంలో తన మనసు గెలుచుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా అంతే పట్టుదలతో వ్యవహరించారు. అశోక్ దిండా వరుసగా రెండోసారి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలవడం వెనుక ఆయన భార్య శ్రేయసి రుద్ర హస్తం ఎంతో ఉంది. వీరిద్దరిది అందమైన ప్రేమ వివాహం. ఓ పార్టీలో మొదలైన వీరి పరిచయం, పెళ్లి పీటల వరకు వెళ్లడానికి అనేక ఆసక్తికరమైన మలుపులు తిరిగింది.

శ్రేయసి రుద్ర వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమెకు మొదటి నుంచీ క్రీడలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రాణం. అశోక్ దిండా ఐపీఎల్ ఆడుతున్న సమయంలో ఆమె స్టేడియానికి వచ్చి ప్రోత్సహించేవారు. వీరిద్దరూ మొదట ఓ స్నేహితుడి పార్టీలో కలుసుకున్నారు. అక్కడ మాటలు కలిసినా, ఫోన్ నంబర్లు మార్చుకోవడానికి దిండా కాస్త సంకోచించారు. చివరికి తన స్నేహితుడి దగ్గర నుంచి శ్రేయసి నంబర్ తీసుకుని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టారు. అలా నాలుగు సంవత్సరాల పాటు సాగిన వీరి ప్రేమాయణం, 22 జూలై 2013న వివాహ బంధంతో ఒక్కటయ్యేలా చేసింది.

అయితే ఈ పెళ్లికి దిండా తల్లి మొదట అస్సలు అంగీకరించలేదు. దాదాపు రెండున్నర ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న తర్వాత, దిండా తన తల్లికి శ్రేయసి గురించి చెప్పారు. తన తల్లి ఒప్పుకోదని ఆయనకు ముందే తెలుసు, అనుకున్నట్లుగానే ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ దిండా తన ప్రేమపై ఉన్న నమ్మకంతో తల్లిని ఒప్పించి, చివరకు శ్రేయసిని తన ఇంటి కోడలిగా చేసుకున్నారు. పెళ్లయ్యాక శ్రేయసి తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి హోమ్ మేకర్‌గా మారడమే కాకుండా, దిండా రాజకీయ జీవితంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. అశోక్ దిండా టీమిండియా తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి ప్రముఖ జట్ల తరపున ఆడి 78 మ్యాచ్‌ల్లో 69 వికెట్లు తీశారు. ఐపీఎల్ ద్వారా దాదాపు రూ. 7 కోట్లకు పైగా సంపాదించిన ఈ 'కోటీశ్వరుడు' ఇప్పుడు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు బెంగాల్ క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక బాధ్యతను చేపట్టబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Story first published: Tuesday, May 5, 2026, 17:26 [IST]
Other articles published on May 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+