For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gujarat Titans: నెహ్రా మాస్టర్ ప్లాన్.. హార్దిక్ కోసం 2015 ప్రపంచకప్ టీమ్‌ బరిలోకి!

ఇతర జట్ల ప్రధాన కోచ్‌లంతా ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్‌లో ప్రత్యర్థి బలాబలాలు చూస్తూ, గణాంకాలు పరిశీలిస్తూ ప్రణాళికలు రచిస్తుంటారు. కానీ గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా మాత్రం సింపుల్‌గా ఓ పేపర్, పెన్‌‌ను ఉపయోగిస్తూ మాస్టర్ ప్లాన్ వేస్తుంటాడు. ప్రత్యర్థులను ఉపయోగించడానికి టెక్నాలజీ, స్టాట్స్ అవసరం లేదని ఎన్నోసార్లు నిరూపించాడు. అయితే ఇటీవల జరిగిన వేలంలో నెహ్రా వ్యూహాలు మరింత భిన్నంగా సాగాయి. హార్దిక్ పాండ్య స్థానాన్ని జట్టులో భర్తీ చేయడానికి గొప్ప నిర్ణయాలే తీసుకున్నాడు.

హార్దిక్ జట్టును వీడటంతో గుజరాత్ టైటాన్స్ కొన్ని సవాళ్లతో వేలానికి వచ్చింది. పేస్ వేసే ఆల్‌రౌండర్‌తో పాటు భారత వికెట్ కీపర్, బ్యాకప్ పేసర్ల కోసం వేలంలో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో మిచెల్ స్టార్క్ కోసం కోల్‌కతాతో తీవ్రంగా పోటీపడింది. కానీ స్టార్క్‌ను దక్కించుకోలేకపోయింది. దీంతో ఆసీస్ మరో ఎడమచేతి వాటం యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్‌ను తీసుకుంది.

Ashish Nehras master plan. The team India 2015 World Cup squad was fielded to replace Hardik pandya

మరోవైపు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు అనూహ్య ధర వెచ్చించి తీసుకుంది. ఉమేశ్ రాకతో గుజరాత్ పేస్ దళం టీమిండియా 2015 ప్రపంచకప్ జట్టును గుర్తు చేస్తుంది. 2015 కప్‌లో మహ్మద్ షమి, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ సత్తాచాటారు. ఇప్పుడు ఈ ముగ్గురు మరోసారి బంతిని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వారితో పాటు యువ పేసర్లు సుశాంత్ శర్మ, కార్తిక్ త్యాగిని జట్టులోకి తీసుకున్నారు. త్యాగి తక్కువ ధరకే సొంతమవ్వడంతో వేలంలో నెహ్రా షాకింగ్‌గా రియాక్ట్ అయ్యాడు.

ఇక హార్దిక్ పవర్ హిట్టింగ్‌ను బ్యాలెన్స్ చేయడానికి యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ను గుజరాత్ తీసుకుంది. షారుక్ మంచి హిట్టర్. అలాగే అఫ్గానిస్థాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఝార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ రాబిన్‌ మింజ్‌‌ను జట్టులో చేర్చి బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసుకుంది.

వేలంలో గుజరాత్‌ దక్కించుకున్న ప్లేయర్లు: స్పెన్సర్‌ జాన్సన్‌ (రూ. 10 కోట్లు), షారుక్‌ ఖాన్‌ (రూ. 7.40 కోట్లు), ఉమేశ్‌ యాదవ్ (రూ. 5.80 కోట్లు), రాబిన్‌ మింజ్‌ (రూ.3.60 కోట్లు), సుశాంత్‌ మిశ్రా (రూ.2.20 కోట్లు), కార్తీక్‌ త్యాగి (రూ.60 లక్షలు), ఒమర్‌జాయ్‌ (రూ.50 లక్షలు), మానవ్‌ సుతార్‌ (రూ.20 లక్షలు)

వేలానికి ముందు అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమి, నూర్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ

Story first published: Thursday, December 21, 2023, 12:52 [IST]
Other articles published on Dec 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+