
హైదరాబాద్: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా త్వరలో కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరిస్ సందర్భంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా... చాలామంది మాజీ క్రికెటర్ల లాగే అతను కూడా వ్యాఖ్యాత కానున్నాడు.
18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో, మొత్తంగా 25 ఏళ్ల పాటు ఆటలో కొనసాగిన నెహ్రా.. ఇక కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తూనే క్రికెట్ కామెంటేటర్‌గా విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా గురువారం నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే తొలి టెస్టులో కామెంటేటర్‌గా వ్వవహరించనున్నాడు.
ఈ విషయాన్ని నెహ్రా ఢిల్లీ సహచరుడు వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. నెహ్రా కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించనున్నాడని, అభిమానులు అతడికి ఘనంగా ఆహ్వానం పలకాలని సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 'కామెంటరీలోకి నెహ్రాజీని ఆహ్వానిస్తున్నాం, అతని వ్యాఖ్యానం తప్పకుండా కావాల్సిందే. అభిమానులను వైవిధ్యమైన శైలిలో అలరించేందుకు నెహ్రాకు స్వాగతం పలుకాల్సిందే' అని ట్వీట్ చేశాడు.
1999లో శ్రీలంకపై టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన నెహ్రా న్యూజిలాండ్‌తో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్ ద్వారా క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు గురువారం కోల్‌కతా వేదికగా ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.