Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేవలం బౌలింగే కాదు.. బ్యాటింగ్ కూడా చూసుకోవాలి..! ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు

Ashish Nehra Serious concerns About Teamindia Batting Lineup For T20 World cup

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల బారిన పడి కోలుకుని తిరిగి జట్టులోకి రావడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు పటిష్ఠంగా కన్పిస్తోంది. ఇక గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా అభిప్రాయం ప్రకారం.. టీ20 ప్రపంచ‌కప్ ముందు భారత జట్టు మ్యాచ్‌లను గెలుపొందడం గురించి కాదు ఆలోంచించాల్సిందీ.. వరల్డ్‌కప్ జట్టుకు సరైన జట్టు కలయికను గుర్తించడం కావాల్సిందంటూ అభిప్రాయపడ్డాడు.

'ప్రపంచ‌కప్‌కు టైం సమీపిస్తున్న టైంలో భారత జట్టు గెలుపు ఫలితం గురించి ఆలోచించొద్దు. జట్టుకు ఏమి కావాలో గుర్తించాలి. భారత్ స్వదేశంలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. ఆస్ట్రేలియాలో చాలా జట్లు ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించవు. ఆసీస్ సిరీస్‌కు ఎంపికైన జట్టులో అయిదుగురు బౌలర్లున్నారు. కాబట్టి జట్టు ఎక్కువగా బౌలింగ్ వైపు చూస్తోంది. కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ ఫాస్ట్ బౌలింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.' అని ఆశిష్ నెహ్రా చెప్పాడు. అయితే టీమిండియా కేవలం బౌలింగ్ విషయాలపై మాత్రమే కాకుండా.. బ్యాటింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని, ఎందుకంటే ఇప్పటివరకు జట్టు ఒక స్థిరమైన లైనప్‌ కలిగిలేదని చెప్పాడు.

పాకిస్థాన్‌పై భారత్ 147పరుగుల లక్ష్యాన్ని ఛేదించే విషయంలో జట్టు బ్యాటింగ్ లోపాలు బయటపడ్డాయని నెహ్రా చెప్పాడు. బౌలింగ్‌లో మాత్రమే కాకుండా జట్టు మొత్తం మెరుగుపడాలని తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్ కలయికపై చాలా ప్రశ్నలు ఉన్నాయన్నాడు. ప్రపంచ‌కప్‌‌కు వెళ్లే సమయానికి జట్టు ఏ విషయంలో తక్కువగా ఉందో దాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరముంది అని నెహ్రా చెప్పాడు. ఇకపోతే జట్టులోని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల మళ్లీ సెంచరీతో మునుపటి ఫామ్ అందుకోవడం జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ఊరటనిచ్చింది. తనదైన రోజున సూర్యకుమార్ యాదవ్ చెలరేగితే మ్యాచ్ వన్ సైడ్ కావడం ఖాయం. ఇక చివర్లో దినేష్ కార్తీక్ విషయంలో జట్టు ప్రయోగాలు తప్పించి.. అతన్ని స్థిరంగా కొనసాగిస్తే మేలు.

Story first published: Sunday, September 18, 2022, 15:50 [IST]
Other articles published on Sep 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+