టీమిండియాకు ధోనీ మళ్లీ ఆడతాడనే నమ్మకం లేదు: మాజీ పేసర్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు.

ప్రశ్నార్థకంలో ధోనీ అంతర్జాతీయ కెరీర్:
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎంఎస్ ధోనీ.. ఈ టోర్నమెంట్‌లో చేసే ప్రదర్శన ఆధారంగా మళ్లీ అతన్ని జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ బోర్డు, కోచ్ తదితరులు వెల్లడించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో.. ఐపీఎల్ 2002 కాస్త రద్దైంది. దీంతో ధోనీ కెరీర్ మళ్లీ ప్రశ్నార్ధకంలో పడింది. ఐపీఎల్ జరగని నేపథ్యంలో ధోనీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు లేవని చాలామంది సీనియర్లు అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

ధోనీ మళ్లీ ఆడతాడనే నమ్మకం లేదు:
'ధోనీ ఫిట్‌గా ఉండి.. ఆడే అవకాశం ఉంటే.. వికెట్ కీపింగ్‌కి అతనే నా నెం.1 ఛాయిస్. అయితే నాకు తెలిసి ధోనీ ఇక క్రికెట్ ఆడకపోవచ్చు. అతను ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తాడో మనం ఊహించలేం. అతను ఇప్పటివరకూ రిటైర్‌మెంట్ ప్రకటించలేదన్న విషయం నిజమే. కానీ.. అతను పరిస్థితుల్ని ఏ క్షణంలో ఎలా మారుస్తాడో మనకు తెలియదు. మహీ రిటైర్మెంట్ఇస్తాడని చెప్పడం బాధాకరం.. ఎందుకంటే అతడు టీమిండియాకు ఎంతో చేసాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ లేదా సంజు సామ్సన్ కాకుండా లోకేష్ రాహుల్ ఆడుతున్నాడు. ధోనీకి ప్రత్యామ్నాయం మాత్రం పంత్ అని నా అభిప్రాయం' అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

అందుకే అత్యుత్తమ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు:
కీపర్‌లు దినేష్ కార్తీక్, పార్థివ్ పటేల్ చేయలేనిది ఎంఎస్ ధోనీ చేసాడు అని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. 'జట్టులోకి వచ్చినప్పుడు ధోనీ కీపర్‌గా అత్యుత్తమం కాదు. అతడి కంటే ముందు కిరణ్ మెర్, నయాన్ మోంగియా భారత్‌కు గొప్ప సేవలు అందించారు. కానీ ఆటపై ఉన్న క్రమశిక్షణ, ఇష్టం, ప్రశాంతత, విశ్వాసం ధోనీని గొప్పవాడిని చేశాయి. తనకి వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుని కార్తీక్, పార్థివ్ కంటే ఎంతో మెరుగని నిరూపించుకున్నాడు. దినేశ్, పార్థివ్ చేయలేనిది ధోనీ చేసాడు కాబట్టి అత్యుత్తమ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌తో మహీ పరుగుల దాహంతో ఉన్నాడని తెలిసింది. అయితే ఆ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడినా మాకు ధోనీ దొరికాడు' అని నెహ్రా పేర్కొన్నాడు.

అదే ధోనీ లాస్ట్ మ్యాచ్:
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న హర్భజన్ సింగ్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లైవ్ సందర్భంగా ధోనీ తిరిగి ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతాడు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు భజ్జీ సమాధానం ఇచ్చాడు. 'ధోనీ ఐపీఎల్‌లో ఆడాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కానీ.. ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే భారత్ జట్టుకి మళ్లీ ఆడాలని ధోనీ ఆశిస్తున్నాడా? లేదా?. నా అంచనా ప్రకారం టీమిండియాకి ఆడాలనే ఇంట్రస్ట్ ప్రస్తుతం అతనికి లేదు. మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని అతనికి లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ని ఆడేశానని అతను భావిస్తున్నాడు' అని హర్భజన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications