Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కెప్టెన్ అయ్యాడు కాబట్టే: వైరల్ ఫోటోపై నెహ్రా స్పందన

హైదరాబాద్: టీమిండియా వెటనర్ పేసర్ ఆశిష్ నెహ్రా.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20తో క్రికెట్‌‌కి వీడ్కోలు పలకడంతో దాదాపు 14 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీకి నెహ్రా బహుమతి అందజేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను కోహ్లీ కెప్టెన్సీలో ఆడటంతో ఈ ఫోటోకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఆ పాత ఫొటోని ఇప్పుడు షేర్ చేస్తూ అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఫొటో వైరల్‌గా మారడంతో నెహ్రాతో పాటు కోహ్లీ స్పందించాడు. 'సోషల్ మీడియాకి నేను చాలా దూరం. ఆనాటి కోహ్లీతో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారిందని తెలుసుకున్నా. కోహ్లీ గొప్పస్థాయికి చేరుకున్నాడు కాబట్టే ఆ ఫొటోకు అంత విలువ' అని నెహ్రా అన్నాడు.

Ashish Nehra reveals why his picture with young Virat Kohli went viral

'అందుకే దాని గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఒకవేళ కోహ్లీ ఈ స్థాయికి చేరకపోయి ఉంటే.. అది ఓ గోడకి సాధారణ ఫొటోలా మిగిలిపోయేది. దాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. నేను వీడ్కోలు చెప్పిన తరుణంలో ఆ ఫొటో బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఫొటో ఘనతంతా విరాట్ కోహ్లీకే దక్కాలి' అని నెహ్రా పేర్కొన్నాడు.

2003లో టీమిండియా వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో కోహ్లీకి నెహ్రా బహుమతి అందజేసిన ఫోటో అది. 'ఆ ఫొటో 13 ఏళ్ల క్రితం తీసుకున్నది. 2003 ప్రపంచకప్‌‌ ఆడిన అనంతరం ఆశిష్ నెహ్రా అక్కడికి వచ్చాడు. నేను అప్పుడు స్కూల్ జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాను' అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

Ashish Nehra reveals why his picture with young Virat Kohli went viral

ఇదిలా ఉంటే బుధవారం జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్లు వేసిన నెహ్రా 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ కూడా దక్కించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో నెహ్రా చివరి ఓవర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి ఓవర్‌ తానే వేస్తానని కోహ్లీని అడిగినట్లు నెహ్రా తెలిపాడు.

'భారత్‌ తరఫున ఎన్నో సార్లు చివరి ఓవర్‌ వేశాను. కానీ అప్పట్లో ఎంతో కొంత ఒత్తిడి ఉండేది. ఈ రోజు మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ వేస్తానని నేనే విరాట్‌ కోహ్లీని అడిగాను. దానికి అతడు ఒప్పుకోవడంతో ఆఖరి ఓవర్‌ వేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది' నెహ్రా చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+