Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆశీష్ నెహ్రా అనుకుంటివా - పుష్కరాల్లో తప్పిపోయిన అన్నదమ్ములు..!!

Ashish Nehra Photos and memes Flooded on Social Media As Rishi Sunak becomes UK PM

ముంబై: ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుమంది ఉంటారని చెబుతుంటారు పెద్దలు. కవల పిల్లలు కానప్పటికీ- ఒకరి రూపంతో మరొకరు ఈ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఉంటారనేది దాని సారాంశం. ఇది నిజమని అనిపించిన సందర్భాలు చాలానే ఉండొచ్చు. అచ్చు గుద్దినట్టు ఒకే రూపంతో మరొకళ్లు ఉన్నారని తెలిసిన తరువాత నోరెళ్లబెడుతుంటాం. అది సహజం. ఒక్కోసారి అలాంటి వ్యక్తులు మన చుట్టే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

రిషి సునాక్- ఆశీష్ నెహ్రా..

ఇప్పుడు సరిగ్గా అలాంటి సంఘటనే తెర మీదికొచ్చింది.. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి రిషి సునాక్ రూపంలో. భారత సంతతికి చెందిన రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ స్థానంలో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. దేశీయ ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఆయన స్వయానా అల్లుడు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకొన్న తరువాత నిర్వహించిన పార్టీ ఎన్నికల్లో లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు.

బ్రిటిషర్లకు ప్రధానిగా..

ఆ తరువాత సంభవించిన పరిణామాల్లో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలో రిషి సునాక్- బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. సంవత్సరాల తరబడి భారత్‌ను పరిపాలించిన బ్రిటీష్ సామ్రాజ్యానికి- అదే భారత సంతతికి చెందిన రిషి సునాక్ పరిపాలించబోతోన్నారు. ఆయనను అభినందిస్తూ దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు పడుతున్నాయి.

ఒకే పోలిక..

ఇదంతా ఒక ఎత్తయితే- చాలామంది నెటిజన్లు రిషి సునాక్‌కు బదులుగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రా ఫొటోను సెలెక్ట్ చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో ఆశీష్ నెహ్రా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. రిషి సునాక్-ఆశీష్ నెహ్రా దాదాపుగా ఒకేలా ఉండటమే దీనికి కారణం. వారిద్దరి హావభావాలు, శరీరం దాదాపు ఒకేలా ఉంటుంది. ఇద్దరూ బక్కపలచగానే ఉంటారు. ఇద్దరి వయస్సు కూడా సమానమే. ఆశీష్ నెహ్రా వయస్సు 43 సంవత్సరాలు కాగా రిషి సునాక్‌ ఏజ్ 42.

కోహినూర్ డైమండూ..

ఆశీష్ నెహ్రాతో పాటు కోహినూర్ డైమండ్ పేరు సైతం ట్రెండ్ అవుతోంది. దీనికీ కారణం లేకపోలేదు. రిషి సునాక్‌ను అర్జంట్‌గా కిడ్నాప్ చేసి, ఆయన స్థానంలో ఆశీష్ నెహ్రాను బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమించాలని, కోహినూర్ డైమండ్‌ను మళ్లీ భారత్‌కు అప్పగించేలా బిల్ పాస్ చేయించాలంటూ నెటిజన్లు ఉచిత సలహాలను ఇస్తోన్నారు.

Story first published: Tuesday, October 25, 2022, 7:38 [IST]
Other articles published on Oct 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+