Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా టెస్టు: సూట్‌లో ఆశిష్ నెహ్రా, పడి పడి నవ్విన క్రికెటర్లు

Ashish Nehra, looking suave in suit and tie, reunites with Team India at Eden Gardens

హైదరాబాద్: తనను సూట్‌లో చూసి భారత జట్టులోని ఆటగాళ్లు పడి పడి నవ్వారని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఫిరోజ్ షా కోట్లాలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా ఈ మ్యాచ్‌ నుంచే కామెంటేటర్‌ బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభానికి ముందు నెహ్రా కామెంటేటరీ బాధ్యతలు నిర్వహించేందుకు మైక్‌ పట్టుకుని మైదానంలోకి వెళ్లాడు.

అదే సమయంలో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, కోచ్‌ భరత్‌ అరుణ్‌ నెహ్రాను చూసి నవ్వారు. నెహ్రూ కూడా వారిని చూడగానే నవ్వడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

అయితే తనను చూసి వారు ఎందుకు నవ్వారో కూడా ఆ తర్వాత నెహ్రా చెప్పడం విశేషం. కామెంటేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన నెహ్రా సూటు, టై ధరించాడు. నెహ్రాను అలా చూడటంతో ఆటగాళ్లు నవ్వుకున్నారు. 'భారత్ తరఫున ఆడే సమయంలో నన్ను ఎవరూ సూటులో చూసిన గుర్తు లేదు. షాట్స్‌, టీషర్టుల్లోనే ఎక్కువ చూశారు' అని నెహ్రా అన్నాడు.

అయితే ఈరోజు ఒక్కసారిగా తనను ఇలా చూసేసరికి వారు నవ్వు ఆపుకోలేకపోయారని నెహ్రా తెలిపాడు. ఇదిలా ఉంటే తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 74/5తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ మూడు వికెట్లను కోల్పోయింది. 54 ఓవర్లు గాను టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 18, 2017, 11:23 [IST]
Other articles published on Nov 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+